Title (Indic)నా వోజలే రమణుఁడ నన్ను నింతసేసీఁగాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా వోజలే రమణుఁడ నన్ను నింతసేసీఁగాక నీ వొళ్ల నేమైనాను నేరములు గలవా (॥నావో॥) హత్తి నీతో నే మాటలాడ సిగ్గువడితేను చిత్తముతో తమకము చిమ్మిరేఁచీని మొత్తానఁ గూరిమిదాఁచి మోమువంచుకొంటేను యెత్తించీఁ గమ్మటిఁ దామే ఇవివో నాయాసలు (॥నావో॥) అడఁకువతో నే నాయగ్గలిక మాన్పుకొంటే నడుమ నావేడుకలు నవ్వించీని బడినుండే నామనసు పరాకు సేసుకుంటే బెడిదపుజవ్వనము పెడరేఁచీని (॥నావో॥) కదిసి నే వినయానఁ గాఁగిలించుకుండితేను యిదె నామైమఱపులు యెనయించీని అదన శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను పొదిగి నాపొందులే బోదించీని English(||pallavi||) nā vojale ramaṇum̐ḍa nannu niṁtasesīm̐gāga nī vŏḽla nemainānu neramulu galavā (||nāvo||) hatti nīdo ne māḍalāḍa sigguvaḍidenu sittamudo tamagamu simmirem̐sīni mŏttānam̐ gūrimidām̐si momuvaṁchugŏṁṭenu yĕttiṁchīm̐ gammaḍim̐ dāme ivivo nāyāsalu (||nāvo||) aḍam̐kuvado ne nāyaggaliga mānpugŏṁṭe naḍuma nāveḍugalu navviṁchīni baḍinuṁḍe nāmanasu parāgu sesuguṁṭe bĕḍidabujavvanamu pĕḍarem̐sīni (||nāvo||) kadisi ne vinayānam̐ gām̐giliṁchuguṁḍidenu yidĕ nāmaimaṟabulu yĕnayiṁchīni adana śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu pŏdigi nābŏṁdule bodiṁchīni