Title (Indic)నా విన్నపము వినవే నలినాక్షి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా విన్నపము వినవే నలినాక్షి చేవ మీర నీకు బుద్దిచెప్పితిఁ జుమ్మీ (॥నావి॥) చనవరితనమును సాదించుకంటేను వినయముతో విభుని వేఁడుట మేలు కనుచూపు నాటఁజూపి కాఁతాళించుకంటేను మనసు రంజిల్లఁగా మాటాడుటే మేలు (॥నావి॥) పంతములు నెరపుచు బయలీఁదించుటకంటే చెంతనుండి ప్రియములు చెప్పట మేలు వంతుల నొట్లువెట్టి వలలఁబెట్టుటకంటె చింతదీర నూడిగాలు సేయుట మేలు (॥నావి॥) పల్లదానఁ గాఁగిలించి పచ్చిగాఁ జేయుటకంటె చల్లఁగా వలపు సారెఁ జల్లుటమేలు కొల్లఁగా నలమేల్ మంగ కూడె శ్రీవేంకటేశుఁడు చిల్లరసిగ్గులకంటె చెనకుట మేలు English(||pallavi||) nā vinnabamu vinave nalinākṣhi seva mīra nīgu buddisĕppidim̐ jummī (||nāvi||) sanavaridanamunu sādiṁchugaṁṭenu vinayamudo vibhuni vem̐ḍuḍa melu kanusūbu nāḍam̐jūbi kām̐tāḽiṁchugaṁṭenu manasu raṁjillam̐gā māḍāḍuḍe melu (||nāvi||) paṁtamulu nĕrabusu bayalīm̐diṁchuḍagaṁṭe sĕṁtanuṁḍi priyamulu sĕppaḍa melu vaṁtula nŏṭluvĕṭṭi valalam̐bĕṭṭuḍagaṁṭĕ siṁtadīra nūḍigālu seyuḍa melu (||nāvi||) palladānam̐ gām̐giliṁchi pachchigām̐ jeyuḍagaṁṭĕ sallam̐gā valabu sārĕm̐ jalluḍamelu kŏllam̐gā nalamel maṁga kūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu sillarasiggulagaṁṭĕ sĕnaguḍa melu