Title (Indic)నా దిక్కు చూచి నీవు నవ్వులెంత నవ్వేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా దిక్కు చూచి నీవు నవ్వులెంత నవ్వేవు దాదాత నీలోని తలఁపు లేడేరెను (॥నాది॥) సలిగె గలదానవు సరసములాడఁగదే కొలువైవున్నాఁ డతఁడు కొంకఁగనేల చెలుల మాఁటున నుండి సిగ్గువడ నేమిటికి వెలయఁగ వలపులు నెల్లవిరులాయను (॥నాది॥) చుట్టమవైనదానవు సుద్దులు చెప్పఁ గదవే యిట్టె నీఇంటికి వచ్చె నెరవులేల వట్టి సన్నలుఁ జాయలు వల దిందరిముందర తెట్టెలైన మీ పొందులు తేటతెల్లమాయను (॥నాది॥) తగులుగల దానవు దండఁ గూచుండఁగదవే మొగముచూచి నిన్నేలె మొరఁగులేల తగు శ్రీ వేంకటేశుఁడు తానే నిన్నూ నన్నూ నేలె జిగిమించి యీ కతలు చెప్పఁగొత్తలాయను English(||pallavi||) nā dikku sūsi nīvu navvulĕṁta navvevu dādāda nīloni talam̐pu leḍerĕnu (||nādi||) saligĕ galadānavu sarasamulāḍam̐gade kŏluvaivunnām̐ ḍadam̐ḍu kŏṁkam̐ganela sĕlula mām̐ṭuna nuṁḍi sigguvaḍa nemiḍigi vĕlayam̐ga valabulu nĕllavirulāyanu (||nādi||) suṭṭamavainadānavu suddulu sĕppam̐ gadave yiṭṭĕ nīiṁṭigi vachchĕ nĕravulela vaṭṭi sannalum̐ jāyalu vala diṁdarimuṁdara tĕṭṭĕlaina mī pŏṁdulu teḍadĕllamāyanu (||nādi||) tagulugala dānavu daṁḍam̐ gūsuṁḍam̐gadave mŏgamusūsi ninnelĕ mŏram̐gulela tagu śhrī veṁkaḍeśhum̐ḍu tāne ninnū nannū nelĕ jigimiṁchi yī kadalu sĕppam̐gŏttalāyanu