Title (Indic)నా భాగ్య మిది యని నవ్వుతా నుండుదుఁ గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా భాగ్య మిది యని నవ్వుతా నుండుదుఁ గాక యే బుద్దులూ నేల చెప్పే రీతఁడే నా దేవరే (॥॥) యెంత వలసినాఁ గద్దు యెంచుకొంటే నా యాస చింతించితేఁ గోరికలు శానాశాన పంతములు చూచితేను పట్టిన దెల్లా నెగ్గు యింతటి విభుని నే నెట్టు దూరవచ్చునే (॥॥) యెన్నైనా నాడఁగవచ్చు నెగసక్కెపు మాటలు పన్నుకొంటే గర్వము పట్టఁగరాదు సన్నల జంకించితేను సణఁగులు రాలుచుండు యెన్నిటి కెన్ని యీతని నెట్టు దూరవచ్చునే (॥॥) ఇచ్చగించి యియ్యకొంటే నింపులే మన నిండు కొచ్చి కూడితే రతులు కొలఁది లేవు యిచ్చట శ్రీ వేంకటేశుఁడిన్నిటాను నన్ను నేలె నెచ్చు కుందుల నితని నెట్టు దూరవచ్చునే English(||pallavi||) nā bhāgya midi yani navvudā nuṁḍudum̐ gāga ye buddulū nela sĕppe rīdam̐ḍe nā devare (||||) yĕṁta valasinām̐ gaddu yĕṁchugŏṁṭe nā yāsa siṁtiṁchidem̐ gorigalu śhānāśhāna paṁtamulu sūsidenu paṭṭina dĕllā nĕggu yiṁtaḍi vibhuni ne nĕṭṭu dūravachchune (||||) yĕnnainā nāḍam̐gavachchu nĕgasakkĕbu māḍalu pannugŏṁṭe garvamu paṭṭam̐garādu sannala jaṁkiṁchidenu saṇam̐gulu rālusuṁḍu yĕnniḍi kĕnni yīdani nĕṭṭu dūravachchune (||||) ichchagiṁchi yiyyagŏṁṭe niṁpule mana niṁḍu kŏchchi kūḍide radulu kŏlam̐di levu yichchaḍa śhrī veṁkaḍeśhum̐ḍinniḍānu nannu nelĕ nĕchchu kuṁdula nidani nĕṭṭu dūravachchune