Title (Indic)మునుపే యెరఁగవద్దా ముందరెత్తులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మునుపే యెరఁగవద్దా ముందరెత్తులు వెనకఁ దలఁచుకొని వెరగందేవా (॥మును॥) యెట్టనెదురుకట్ల నింతి నిలుచుకుండఁగా అట్టె తల వంచేవు అది యేమయ్యా ఱట్టడివై యాపెమఱఁగున నేమైనఁ జేసి చిట్టకాల కింతలోనే సిగ్గుపడేవా (॥మును॥) మఱఁగున నుండి యాపె మాటలు నిన్నడుగఁగ చిఱునవ్వులు నవ్వి కొంచేవేమయ్యా మెఱసి దుండగాలెల్ల మీఁద మీఁదఁ జేసి మఱపు లిప్పుడు నేఁడు మందలించేవా (॥మును॥) గక్కన నీ దేవులు కాఁగిలించుకొనఁ గానే యెక్కుడుప్రియాలు చెప్పే విదియేమయ్యా వొక్కటై శ్రీ వేంకటేశ వొడ్డినరతులఁ జొక్కి మిక్కిలి చనవు లిచ్చి మెచ్చ మెచ్చేవా English(||pallavi||) munube yĕram̐gavaddā muṁdarĕttulu vĕnagam̐ dalam̐sugŏni vĕragaṁdevā (||munu||) yĕṭṭanĕdurugaṭla niṁti nilusuguṁḍam̐gā aṭṭĕ tala vaṁchevu adi yemayyā ṟaṭṭaḍivai yābĕmaṟam̐guna nemainam̐ jesi siṭṭagāla kiṁtalone siggubaḍevā (||munu||) maṟam̐guna nuṁḍi yābĕ māḍalu ninnaḍugam̐ga siṟunavvulu navvi kŏṁchevemayyā mĕṟasi duṁḍagālĕlla mīm̐da mīm̐dam̐ jesi maṟabu lippuḍu nem̐ḍu maṁdaliṁchevā (||munu||) gakkana nī devulu kām̐giliṁchugŏnam̐ gāne yĕkkuḍupriyālu sĕppe vidiyemayyā vŏkkaḍai śhrī veṁkaḍeśha vŏḍḍinaradulam̐ jŏkki mikkili sanavu lichchi mĕchcha mĕchchevā