Title (Indic)మొగమోటదాన నేను మొక్కే నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మొగమోటదాన నేను మొక్కే నీకు ఇగురుఁబోఁడిని నేను యెవ్వరి దూరుదును (॥మొగ॥) సారె సారెఁ బొగడఁగ సన్నలు నీవు సేయఁగ కోరి నిన్నుఁ దిట్టవచ్చి కొంకితి నేను నేరములెంచఁగఁబోఇ నీకు లోనాయ మనసు యీరీతినే వెరగైతి నెవ్వరి దూరుదును (॥మొగ॥) ఇచ్చకము నెరపఁగ యెదురుగా నవ్వఁగాను మచ్చరించవచ్చి యట్టె మానికి నేను పచ్చిసేయ దొరకొంటి భ్రమయించె నా వయసు యెచ్చరికె నాకు లేదు యెవ్వరి దూరుదును (॥మొగ॥) వంచెనతోఁ గూడఁగాను వైపుగా శ్రీ వేంకటేశ మించఁదలఁచి రతుల మెచ్చితి నిన్ను కంచము పొత్తుకు వచ్చి కడు నోరూరించెఁ బొందు ఎంచరాదు తరితీపు లెవ్వరి దూరుదును English(||pallavi||) mŏgamoḍadāna nenu mŏkke nīgu igurum̐bom̐ḍini nenu yĕvvari dūrudunu (||mŏga||) sārĕ sārĕm̐ bŏgaḍam̐ga sannalu nīvu seyam̐ga kori ninnum̐ diṭṭavachchi kŏṁkidi nenu neramulĕṁcham̐gam̐boi nīgu lonāya manasu yīrīdine vĕragaidi nĕvvari dūrudunu (||mŏga||) ichchagamu nĕrabam̐ga yĕdurugā navvam̐gānu machchariṁchavachchi yaṭṭĕ mānigi nenu pachchiseya dŏragŏṁṭi bhramayiṁchĕ nā vayasu yĕchcharigĕ nāgu ledu yĕvvari dūrudunu (||mŏga||) vaṁchĕnadom̐ gūḍam̐gānu vaibugā śhrī veṁkaḍeśha miṁcham̐dalam̐si radula mĕchchidi ninnu kaṁchamu pŏttugu vachchi kaḍu norūriṁchĕm̐ bŏṁdu ĕṁcharādu taridību lĕvvari dūrudunu