Title (Indic)మీరు సేసే పనులకు మేము గోరే పను లేమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మీరు సేసే పనులకు మేము గోరే పను లేమి నేరుపు నీ దైవికమే నెరపుదు గాకా (॥మీరు॥) ఎవ్వరు నీకుఁ జెప్పఁగా నిల నపాండవ మంటే అవ్వలఁ గాకుండుఁ గాక అని యంటివి నెవ్వగ విభీషణుఁడు నిన్నేమి వేఁడుకొనఁగా రవ్వగా నట్టే లంకారాజ్య మొసంగితివి (॥మీరు॥) రమ్మని యెవ్వరనఁగా రాముఁడవై విచ్చేసి యిమ్ముల నహల్య శాప మిటు దీర్చితి దొమ్మిలో నేమి చెప్పఁగా దూరి విజయునికై కమ్మర భీష్మునిపై జక్ర మేల యెత్తిలివి (॥మీరు॥) చెలఁగి ధ్రువుని కెల్ల చెక్కుల నీ శంఖ మూఁది పలునుతులు చేకొని పట్ట మిచ్చితి యెలమి శ్రీ వేంకటేశ యేమీ నెఱుఁగము యిల నిరుహేతుకాన నెట్లైనఁ గావవే English(||pallavi||) mīru sese panulagu memu gore panu lemi nerubu nī daivigame nĕrabudu gāgā (||mīru||) ĕvvaru nīgum̐ jĕppam̐gā nila nabāṁḍava maṁṭe avvalam̐ gāguṁḍum̐ gāga ani yaṁṭivi nĕvvaga vibhīṣhaṇum̐ḍu ninnemi vem̐ḍugŏnam̐gā ravvagā naṭṭe laṁkārājya mŏsaṁgidivi (||mīru||) rammani yĕvvaranam̐gā rāmum̐ḍavai vichchesi yimmula nahalya śhāba miḍu dīrsidi dŏmmilo nemi sĕppam̐gā dūri vijayunigai kammara bhīṣhmunibai jakra mela yĕttilivi (||mīru||) sĕlam̐gi dhruvuni kĕlla sĕkkula nī śhaṁkha mūm̐di palunudulu segŏni paṭṭa michchidi yĕlami śhrī veṁkaḍeśha yemī nĕṟum̐gamu yila niruhedugāna nĕṭlainam̐ gāvave