Title (Indic)మేటి వేంకటేశునకు మేలుదానను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మేటి వేంకటేశునకు మేలుదానను తేటలుగా నాసలనే తెల్లవారును (॥మేటి॥) చెప్పరే చెలులాల చెవులార వినే నేను యెప్పుడు వచ్చునే మాయింటి కాఁతడు చొప్పులెత్తి యెదురులుచూడఁగా నింతటిలొనే వుప్పతిల్లి గక్కనఁ జంద్రొదయ మాయను (॥మేటి॥) ఇరవై యెఱిఁగించరే యిట్టె మిమ్ము సంతోసించే గరిమ నామీఁద బత్తిగలఁడటరే తెరమఱగుకు రాఁగా తేరి మొగము చూచితే సొరిదిఁ గొవిల లిట్టె సొబానఁ బాడెను (॥మేటి॥) వెలయఁ బెండ్లి సేయరే వేడుకయ్యీ నిదె నాకు తెలిసి యీతఁడు సమ్మతించెనటరే అలమేలుమంగను నే నతఁడు శ్రీవేంకటేశుఁ- డలమె మంచిముహుర్త మప్పుడే వచ్చెను English(||pallavi||) meḍi veṁkaḍeśhunagu meludānanu teḍalugā nāsalane tĕllavārunu (||meḍi||) sĕppare sĕlulāla sĕvulāra vine nenu yĕppuḍu vachchune māyiṁṭi kām̐taḍu sŏppulĕtti yĕdurulusūḍam̐gā niṁtaḍilŏne vuppadilli gakkanam̐ jaṁdrŏdaya māyanu (||meḍi||) iravai yĕṟim̐giṁchare yiṭṭĕ mimmu saṁtosiṁche garima nāmīm̐da battigalam̐ḍaḍare tĕramaṟagugu rām̐gā teri mŏgamu sūside sŏridim̐ gŏvila liṭṭĕ sŏbānam̐ bāḍĕnu (||meḍi||) vĕlayam̐ bĕṁḍli seyare veḍugayyī nidĕ nāgu tĕlisi yīdam̐ḍu sammadiṁchĕnaḍare alamelumaṁganu ne nadam̐ḍu śhrīveṁkaḍeśhum̐- ḍalamĕ maṁchimuhurda mappuḍe vachchĕnu