Title (Indic)మరుఁడు సేసిన మాయ మగలకు నాండ్లకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మరుఁడు సేసిన మాయ మగలకు నాండ్లకు విరసాలు వుట్టవు వేడుకే కాని (॥॥) యెంత దూరి మాటాడినా యింపు లయ్యే వుండుఁగాని పంతము రేఁగ దింతిపైఁ బతికి పొంతనుండి సారె సారె బొమ్మల జంకించినాను వింతలు దోఁచవు మరి వేడుకే కాని (॥॥) చలపట్టి సరసము జరయుచు నాడినాను అలయిక వుట్టదు దేహమునకును పెలుచుఁ దనాన మరి పెనఁగులా టాడినాను వెలయ వేసటగాదు వేడుకేకాని (॥॥) మిన్నక కొసరి మందె మేళ మెంత సేసినాను అన్నిటా లోలో నెగ్గులై మించవు యెన్నఁగ శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను విన్నప్పుడే కూడె మాకు వేడుకలె కాని English(||pallavi||) marum̐ḍu sesina māya magalagu nāṁḍlagu virasālu vuṭṭavu veḍuge kāni (||||) yĕṁta dūri māḍāḍinā yiṁpu layye vuṁḍum̐gāni paṁtamu rem̐ga diṁtibaim̐ badigi pŏṁtanuṁḍi sārĕ sārĕ bŏmmala jaṁkiṁchinānu viṁtalu dom̐savu mari veḍuge kāni (||||) salabaṭṭi sarasamu jarayusu nāḍinānu alayiga vuṭṭadu dehamunagunu pĕlusum̐ danāna mari pĕnam̐gulā ṭāḍinānu vĕlaya vesaḍagādu veḍugegāni (||||) minnaga kŏsari maṁdĕ meḽa mĕṁta sesinānu anniḍā lolo nĕggulai miṁchavu yĕnnam̐ga śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu vinnappuḍe kūḍĕ māgu veḍugalĕ kāni