Title (Indic)మరిగినమీఁదనయ్యీ మనమెంచుకొన్నట్టె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మరిగినమీఁదనయ్యీ మనమెంచుకొన్నట్టె కరి(ర)కరిఁ బెట్టకురే కడుఁగడు మీరు (॥మరి॥) తలఁచఁగఁ దలఁచఁగ తానే యీడకు విచ్చేసె కలుచ పరచకురే కాంతలాల నెలకొన్నరమణుని నేనే సాదించేఁగాని అలరి యప్పటి మాఁటలాడకురే మీరు (॥మరి॥) మన మాడేమనఁగానే మాటలాతఁడే యాడె మనసు విరుచకురే మగువలాల వెనకముందరికెల్లా వేడుక సేసేఁగాని చెనకి యాతని రట్టు సేయకురే మీరు (॥మరి॥) చెఱఁగు నేఁ బట్టఁగానే చేరి యాతఁడు కూడె గుఱిగా దూరకురే కొమ్మలాల తఱి శ్రీ వేంకటేశుఁడు తాను నేను నొక్కటే యెఱుఁగు నన్నియు నేరా లెంచకురే మీరు English(||pallavi||) mariginamīm̐danayyī manamĕṁchugŏnnaṭṭĕ kari(ra)karim̐ bĕṭṭagure kaḍum̐gaḍu mīru (||mari||) talam̐sam̐gam̐ dalam̐sam̐ga tāne yīḍagu vichchesĕ kalusa parasagure kāṁtalāla nĕlagŏnnaramaṇuni nene sādiṁchem̐gāni alari yappaḍi mām̐ṭalāḍagure mīru (||mari||) mana māḍemanam̐gāne māḍalādam̐ḍe yāḍĕ manasu virusagure maguvalāla vĕnagamuṁdarigĕllā veḍuga sesem̐gāni sĕnagi yādani raṭṭu seyagure mīru (||mari||) sĕṟam̐gu nem̐ baṭṭam̐gāne seri yādam̐ḍu kūḍĕ guṟigā dūragure kŏmmalāla taṟi śhrī veṁkaḍeśhum̐ḍu tānu nenu nŏkkaḍe yĕṟum̐gu nanniyu nerā lĕṁchagure mīru