Title (Indic)మరిగేమీ నెఱఁగను మంకు గొల్లదాన నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మరిగేమీ నెఱఁగను మంకు గొల్లదాన నేను సరిలేని నవ్వులతో సరసమాడుదును (॥మరిగే॥) బలిమి నేఁ జేయఁ గాని పంతమాడి నిన్నునిట్టె వలపించి నీ మోము వాడు దేర్తును చలము సాదించఁ గాని చనవు చేసుక నీ వెలలేని మోవెల్లా వేడుకల నింతును (॥మరిగే॥) బొమ్మల జంకించఁ గాని పొద్దు పొద్దుఁ గాచుకుండి సమ్మతించ నీ మనసు జట్టిగొందును చిమ్ముచుఁ గొసరఁ గాని చేతులు నీపైఁ జాచి ఉమ్మడి నా గోరి కొనలొడలెల్ల నింతును (॥మరిగే॥) నేరమెంచఁ గాని నేను నీతోనే మాఁటలాడి చేరువ నీ మన్ననలు చేకొందును యీరీతి శ్రీ వేకంటేశ యిట్టె నన్నుఁ గూడితివి పేరుకొని యిఁక నిన్ను ప్రియాన మెప్పింతును English(||pallavi||) marigemī nĕṟam̐ganu maṁku gŏlladāna nenu sarileni navvulado sarasamāḍudunu (||marige||) balimi nem̐ jeyam̐ gāni paṁtamāḍi ninnuniṭṭĕ valabiṁchi nī momu vāḍu derdunu salamu sādiṁcham̐ gāni sanavu sesuga nī vĕlaleni movĕllā veḍugala niṁtunu (||marige||) bŏmmala jaṁkiṁcham̐ gāni pŏddu pŏddum̐ gāsuguṁḍi sammadiṁcha nī manasu jaṭṭigŏṁdunu simmusum̐ gŏsaram̐ gāni sedulu nībaim̐ jāsi ummaḍi nā gori kŏnalŏḍalĕlla niṁtunu (||marige||) neramĕṁcham̐ gāni nenu nīdone mām̐ṭalāḍi seruva nī mannanalu segŏṁdunu yīrīdi śhrī vegaṁṭeśha yiṭṭĕ nannum̐ gūḍidivi perugŏni yim̐ka ninnu priyāna mĕppiṁtunu