Title (Indic)మనుజు లూరకే తాము మరఁగులంటా నుందురు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మనుజు లూరకే తాము మరఁగులంటా నుందురు యెనసి దేవుఁడు సేసే నిందరికి మాయ (॥మను॥) వినికందరి కొక్కటే వివరములే వేరు కనుచూపులు నొక్కటే కాంక్షలే వేరు మనసూ నొక్కటే లోనిమర్మములే వేరు తనివియు నొక్కటే తనువులే వేరు (॥మను॥) లోకమును నొక్కటే లోనువెలుపల వేరు వాకు లొక్కటే భాషలవరుసే వేరు జోక నాహార మొక్కటే సొరిది రుచులే వేరు కైకొన్నరతి యొక్కటే కందువలే వేరు (॥మను॥) పరిమళ మొక్కటే భాగించుకొనుటే వేరు యిరవైన దొక్కటే యింపులే వేరు అరిది శ్రీవేంకటేశ అన్నిటా నీదాఁసుడు(ల?) శరణాగతి యొక్కటే జాతులే వేరు English(||pallavi||) manuju lūrage tāmu maram̐gulaṁṭā nuṁduru yĕnasi devum̐ḍu sese niṁdarigi māya (||manu||) vinigaṁdari kŏkkaḍe vivaramule veru kanusūbulu nŏkkaḍe kāṁkṣhale veru manasū nŏkkaḍe lonimarmamule veru taniviyu nŏkkaḍe tanuvule veru (||manu||) logamunu nŏkkaḍe lonuvĕlubala veru vāgu lŏkkaḍe bhāṣhalavaruse veru joga nāhāra mŏkkaḍe sŏridi rusule veru kaigŏnnaradi yŏkkaḍe kaṁduvale veru (||manu||) parimaḽa mŏkkaḍe bhāgiṁchugŏnuḍe veru yiravaina dŏkkaḍe yiṁpule veru aridi śhrīveṁkaḍeśha anniḍā nīdām̐suḍu(la?) śharaṇāgadi yŏkkaḍe jādule veru