Title (Indic)మన్నించుమనవే మమ్మేల పైకొనుమనీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మన్నించుమనవే మమ్మేల పైకొనుమనీ చన్నుల నొత్తఁగాను చలము లెట్లుండునో (॥మన్నిం॥) తప్పక తనుఁ జూచితే తనువెల్లాఁ జెమరించె యిప్పుడే మేలమాడితే నెట్లుండునో చిప్పిల వొద్దికి రాఁగా సిగ్గులెల్లా వెడజారె తప్పి చేయి దాఁకితేను తమకా లెట్లుండునో (॥మన్నిం॥) మంచిమాఁటలాడితేను మనసెల్లా వెరగందె యుంక కొంగు వట్టితే యెట్లుండునో వంచనతో నొరసితే వలపులు చిమ్మిరేఁగె కంచముపొత్తుకు రాఁగా కాంక్ష లెల్లుండునో (॥మన్నిం॥) సెలవి నవ్వు నవ్వితే చెక్కులెల్లాఁ బులకించె యెలమిఁగాఁగిలించితే నెట్టుండునో అలరి శ్రీవేంకటేశుఁడంతలోనె నన్నుఁగూడె బలిమి సేయఁగబోతే పంతము లెట్లుండునో English(||pallavi||) manniṁchumanave mammela paigŏnumanī sannula nŏttam̐gānu salamu lĕṭluṁḍuno (||manniṁ||) tappaga tanum̐ jūside tanuvĕllām̐ jĕmariṁchĕ yippuḍe melamāḍide nĕṭluṁḍuno sippila vŏddigi rām̐gā siggulĕllā vĕḍajārĕ tappi seyi dām̐kidenu tamagā lĕṭluṁḍuno (||manniṁ||) maṁchimām̐ṭalāḍidenu manasĕllā vĕragaṁdĕ yuṁka kŏṁgu vaṭṭide yĕṭluṁḍuno vaṁchanado nŏraside valabulu simmirem̐gĕ kaṁchamubŏttugu rām̐gā kāṁkṣha lĕlluṁḍuno (||manniṁ||) sĕlavi navvu navvide sĕkkulĕllām̐ bulagiṁchĕ yĕlamim̐gām̐giliṁchide nĕṭṭuṁḍuno alari śhrīveṁkaḍeśhum̐ḍaṁtalonĕ nannum̐gūḍĕ balimi seyam̐gabode paṁtamu lĕṭluṁḍuno