Title (Indic)మంచివాఁడవయ్య నీవు మమ్మేల రట్టు సేసేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మంచివాఁడవయ్య నీవు మమ్మేల రట్టు సేసేవు ముంచి నీకు మొక్కేము మన్నించవయ్యా యిపుడు (॥మంచి॥) పలికినట్టే నీతోఁ బలుమనేవు నన్ను మెలుఁత కింతేసి మందెమేళమేఁటి బలిమితో వసంతము పైఁజల్లుమని యాడేవు వలపులు గనమైతే వరుసదప్పుదురా (॥మంచి॥) సరికి బేసికి నీతో సారెఁ బెనఁగు మనేవు తరుణిని నాకింత వుద్దండాలేఁటికి పరగ జూఁజాలాడి పందము గొనమనేవు మురిపెము గనమైతే మొకళము లెంతురా (॥మంచి॥) మెట్టినట్టి నీపాదము మొట్టుమనేవు నన్నిటు పట్టపురాణి నాకింత పంతమేఁటికి యిట్టె శ్రీవేంకటేశ యెనసితివి రతుల చుట్టరికము గలితే సొంట్లు సోదింతురా English(||pallavi||) maṁchivām̐ḍavayya nīvu mammela raṭṭu sesevu muṁchi nīgu mŏkkemu manniṁchavayyā yibuḍu (||maṁchi||) paliginaṭṭe nīdom̐ balumanevu nannu mĕlum̐ta kiṁtesi maṁdĕmeḽamem̐ṭi balimido vasaṁtamu paim̐jallumani yāḍevu valabulu ganamaide varusadappudurā (||maṁchi||) sarigi besigi nīdo sārĕm̐ bĕnam̐gu manevu taruṇini nāgiṁta vuddaṁḍālem̐ṭigi paraga jūm̐jālāḍi paṁdamu gŏnamanevu muribĕmu ganamaide mŏgaḽamu lĕṁturā (||maṁchi||) mĕṭṭinaṭṭi nībādamu mŏṭṭumanevu nanniḍu paṭṭaburāṇi nāgiṁta paṁtamem̐ṭigi yiṭṭĕ śhrīveṁkaḍeśha yĕnasidivi radula suṭṭarigamu galide sŏṁṭlu sodiṁturā