Title (Indic)మగవాఁడు మెత్తనైతే మరి యపకీర్తి గాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మగవాఁడు మెత్తనైతే మరి యపకీర్తి గాదా తగవు నెరపకుంటే తరుణులు మెత్తురా (॥॥) నీపదాలు వాడి ఇంతి నిన్నుఁ గాఁగిలించెనంటా కోపగించి నీదేవులు కొంగువట్టెను చూపెట్టుక వున్నాఁడవు చొక్కి విడిపించవద్దా యీపాటివాఁడవైతే యెవ్వరు నమ్మేరు (॥॥) సేవసేసే ఆఁటది చేరి పాదాల లొతైనంటా వోవరిలోఁ దనవద్ద నుంచుకొన్నది నీవద్దకి నంపుమని నేఁ డాపకుఁ జెప్పకుంటే యీవలావలి పొందు లెట్టు జరగీని (॥॥) నాటక్కఁ సాలమగున నవ్వి నిన్నుఁ గూడెనంటా మేటియలమేల్మంగ మీరనియ్యదు నీటున శ్రీ వేంకటేశ నీవె తెచ్చుకొనవలె మాటపట్టు లెటువలె మచ్చిక రేఁచీని English(||pallavi||) magavām̐ḍu mĕttanaide mari yabagīrdi gādā tagavu nĕrabaguṁṭe taruṇulu mĕtturā (||||) nībadālu vāḍi iṁti ninnum̐ gām̐giliṁchĕnaṁṭā kobagiṁchi nīdevulu kŏṁguvaṭṭĕnu sūbĕṭṭuga vunnām̐ḍavu sŏkki viḍibiṁchavaddā yībāḍivām̐ḍavaide yĕvvaru nammeru (||||) sevasese ām̐ṭadi seri pādāla lŏdainaṁṭā vovarilom̐ danavadda nuṁchugŏnnadi nīvaddagi naṁpumani nem̐ ḍābagum̐ jĕppaguṁṭe yīvalāvali pŏṁdu lĕṭṭu jaragīni (||||) nāḍakkam̐ sālamaguna navvi ninnum̐ gūḍĕnaṁṭā meḍiyalamelmaṁga mīraniyyadu nīḍuna śhrī veṁkaḍeśha nīvĕ tĕchchugŏnavalĕ māḍabaṭṭu lĕḍuvalĕ machchiga rem̐sīni