Title (Indic)మానరాదు నేఁ దప్పులు మఱి యెన్ని చేసినాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మానరాదు నేఁ దప్పులు మఱి యెన్ని చేసినాను కానిమ్మని నీకు నిట్టే కరుణించవలెను (॥వన॥) వేడుకైన నీ దేవుల విన్నపము విని కాని యీడులేని నీ బిరుదు లెంచి కాని పాడికొని నామముల ప్రభావాన నైనఁగాని యేడనై నా నీ దాసుఁడ నెంచి కావవలెను (॥వన॥) నమ్మి నిన్నుఁ గొల్చిన నా గురునిఁ జూచి కాని కమ్మకొని నాదైన్యము కనైనఁ గాని వుమ్మడి నీకుఁ గలుగు నుదారత్వమునఁ గాని పమ్మి నన్ను రక్షించి బ్రదికించవలెను (॥వన॥) హరి నాలోపల నున్న సమ్మంధమునఁ గాని నిరతి నేలికలైన నెపానఁ గాని పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశ హరి నాకుఁ బ్రత్యక్షమై ఆదరించవలెను English(||pallavi||) mānarādu nem̐ dappulu maṟi yĕnni sesinānu kānimmani nīgu niṭṭe karuṇiṁchavalĕnu (||vana||) veḍugaina nī devula vinnabamu vini kāni yīḍuleni nī birudu lĕṁchi kāni pāḍigŏni nāmamula prabhāvāna nainam̐gāni yeḍanai nā nī dāsum̐ḍa nĕṁchi kāvavalĕnu (||vana||) nammi ninnum̐ gŏlsina nā gurunim̐ jūsi kāni kammagŏni nādainyamu kanainam̐ gāni vummaḍi nīgum̐ galugu nudāratvamunam̐ gāni pammi nannu rakṣhiṁchi bradigiṁchavalĕnu (||vana||) hari nālobala nunna sammaṁdhamunam̐ gāni niradi neligalaina nĕbānam̐ gāni paraga nalamelmaṁgabadi śhrīveṁkaḍeśha hari nāgum̐ bratyakṣhamai ādariṁchavalĕnu