Title (Indic)మానలేనే పొందు మానలేనే నిన్ను మానలేనే । ఆ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మానలేనే పొందు మానలేనే నిన్ను మానలేనే । ఆ- ఆనెను మోహము నేఁ డంటవే నాదేహము (॥మాన॥) చక్కఁదనములతేట చల్లనివెన్నెలవూట వొక్కమాటడవే నీ వొద్దిక మాట చక్కెరవింటిలో తూపు జవ్వనములో నీరూపు గక్కనఁ జూడవే కడకంటిచూపు (॥మాన॥) యింపుఁజిగురుఁజప్పర మిన్నిటిలో బిత్తరము సొంపుగఁ జాఁచవే నీసోగకరము సంపదల ముజ్జగము చందురునిసోయగము జంపులేల యెత్తవే నీసవరనిమొగము (॥మాన॥) మదనుని తేరుజోక మంచిమెఱుఁగుల రేక యెదురు చూడఁగ వచ్చే విట్టి నీరాక ఇదె శ్రీ వేంకటగిరి నిరవై వావిలిపాటఁ బొదలిన రాఘవుఁడఁ బొందితి నదె English(||pallavi||) mānalene pŏṁdu mānalene ninnu mānalene | ā- ānĕnu mohamu nem̐ ḍaṁṭave nādehamu (||māna||) sakkam̐danamuladeḍa sallanivĕnnĕlavūḍa vŏkkamāḍaḍave nī vŏddiga māḍa sakkĕraviṁṭilo tūbu javvanamulo nīrūbu gakkanam̐ jūḍave kaḍagaṁṭisūbu (||māna||) yiṁpum̐jigurum̐jappara minniḍilo bittaramu sŏṁpugam̐ jām̐save nīsogagaramu saṁpadala mujjagamu saṁdurunisoyagamu jaṁpulela yĕttave nīsavaranimŏgamu (||māna||) madanuni terujoga maṁchimĕṟum̐gula rega yĕduru sūḍam̐ga vachche viṭṭi nīrāga idĕ śhrī veṁkaḍagiri niravai vāvilibāḍam̐ bŏdalina rāghavum̐ḍam̐ bŏṁdidi nadĕ