Title (Indic)మాకుఁ జూడ నిదిమేలు మనసు నీ కెట్టున్నదో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకుఁ జూడ నిదిమేలు మనసు నీ కెట్టున్నదో చేకొని నీకు నితవు చెప్పితిమి నేము (॥మాకు॥) వనితపయ్యదలోని వట్రువచన్నుగుబ్బలు కనుఁగొంటివా వోయి గక్కున నీవు పెనఁగి నీవురమునఁ బెట్టుకొంటేఁ గనక చెనకేరతుల నీవు చేసిన భాగ్యము (॥మాకు॥) తెలివైనమోము లోని తేనెగా రేయాకెమోవి తలఁచుకొంటివో లేదో తగిలి నీవు నెలకొన నీనోరిలో వించుకొంటేఁగనక తలకొని నీవు సేయుతపము లీడేరును (॥మాకు॥) మెచ్చులనలమేల్ మంగమేనిమీఁదివాసనలు యిచ్చల శ్రీవేంకటేశ యెఱుఁగుదువా పచ్చిగా నీమేన నిండాఁ బట్టించుకొంటేఁ గనక అచ్చుగాఁ గూడితి నీకు నమరె వలపులు English(||pallavi||) māgum̐ jūḍa nidimelu manasu nī kĕṭṭunnado segŏni nīgu nidavu sĕppidimi nemu (||māgu||) vanidabayyadaloni vaṭruvasannugubbalu kanum̐gŏṁṭivā voyi gakkuna nīvu pĕnam̐gi nīvuramunam̐ bĕṭṭugŏṁṭem̐ ganaga sĕnageradula nīvu sesina bhāgyamu (||māgu||) tĕlivainamomu loni tenĕgā reyāgĕmovi talam̐sugŏṁṭivo ledo tagili nīvu nĕlagŏna nīnorilo viṁchugŏṁṭem̐ganaga talagŏni nīvu seyudabamu līḍerunu (||māgu||) mĕchchulanalamel maṁgamenimīm̐divāsanalu yichchala śhrīveṁkaḍeśha yĕṟum̐guduvā pachchigā nīmena niṁḍām̐ baṭṭiṁchugŏṁṭem̐ ganaga achchugām̐ gūḍidi nīgu namarĕ valabulu