Title (Indic)మాకుఁ దెలియవు మీలో మర్మములివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకుఁ దెలియవు మీలో మర్మములివి వాకున నాడఁగరాదు వర్ణించుకో నీవే (॥॥) దాకొని యొక ఇద్దరు తరుణులు నిన్నుఁ జూచి యేకతము లాడుకొనే రేఁటికోకాని కైకొని నీవు సేసినకల్లలేమైనాఁ గలితే చేకోని తలఁచుకొమ్మా చిత్తములో నీవే (॥॥) యెన్నికతో తమ్ముఁదామె ఇట్టె నీ భావములకు సన్నలుసేకోనే రాచందమేఁటిదో కన్న విన్న నీమతకములేమైనాఁగలికే వున్నతిఁ దెలుసుకొమ్మా వూహించి నీవే (॥॥) వువ్విళ్లూరఁ గూడి నిన్నొండురులు శ్రీ వేంకటేశ నవ్వుకొనేరు రతులనను పెట్టిదో ఇవ్వల నన్నేలితివి ఇంకా నీగుట్టు గలితే రవ్వగాఁ దెలుసుకొమ్మా రపముగా నీవే English(||pallavi||) māgum̐ dĕliyavu mīlo marmamulivi vāguna nāḍam̐garādu varṇiṁchugo nīve (||||) dāgŏni yŏga iddaru taruṇulu ninnum̐ jūsi yegadamu lāḍugŏne rem̐ṭigogāni kaigŏni nīvu sesinagallalemainām̐ galide segoni talam̐sugŏmmā sittamulo nīve (||||) yĕnnigado tammum̐dāmĕ iṭṭĕ nī bhāvamulagu sannalusegone rāsaṁdamem̐ṭido kanna vinna nīmadagamulemainām̐galige vunnadim̐ dĕlusugŏmmā vūhiṁchi nīve (||||) vuvviḽlūram̐ gūḍi ninnŏṁḍurulu śhrī veṁkaḍeśha navvugŏneru radulananu pĕṭṭido ivvala nannelidivi iṁkā nīguṭṭu galide ravvagām̐ dĕlusugŏmmā rabamugā nīve