Title (Indic)మాకుఁ దెలియవు మీ మర్మము లెటువంటివో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకుఁ దెలియవు మీ మర్మము లెటువంటివో జోకతో దవ్వుల నుండే చూచి తనివాయను (॥॥) సిరుల నవ్వుల నాకె సేసిన నిన్నపాలు తరితీపై యవి నీ చిత్తానఁ బట్టేనా సరుసఁ గూచుండి యాకు సారె మడి చిచ్చె నీకు సరసపు వేడుకతో చవులాయనా (॥॥) సిగ్గులు వడుతా నీ చేతి నెటికలు దీసె అగ్గమై నీలోని యాయాలు ముట్టేనా నిగ్గుల గోర గీరి ని తురుము చక్కఁబెట్టె వొగ్గి నీ మనోరథాలు వొనగూడెనా (॥॥) వొంటి నుండి సేయరాని పూడిగా లెల్లాఁజేసె జంటలై చుట్టరికాలు సమకూడెనా యింటనే శ్రీ వేంకటేశ యిటు నన్ను నేలితివి అంటి నే చిత్తమునకు నానందమై వుండెనా English(||pallavi||) māgum̐ dĕliyavu mī marmamu lĕḍuvaṁṭivo jogado davvula nuṁḍe sūsi tanivāyanu (||||) sirula navvula nāgĕ sesina ninnabālu taridībai yavi nī sittānam̐ baṭṭenā sarusam̐ gūsuṁḍi yāgu sārĕ maḍi sichchĕ nīgu sarasabu veḍugado savulāyanā (||||) siggulu vaḍudā nī sedi nĕḍigalu dīsĕ aggamai nīloni yāyālu muṭṭenā niggula gora gīri ni turumu sakkam̐bĕṭṭĕ vŏggi nī manorathālu vŏnagūḍĕnā (||||) vŏṁṭi nuṁḍi seyarāni pūḍigā lĕllām̐jesĕ jaṁṭalai suṭṭarigālu samagūḍĕnā yiṁṭane śhrī veṁkaḍeśha yiḍu nannu nelidivi aṁṭi ne sittamunagu nānaṁdamai vuṁḍĕnā