Title (Indic)మాకు నేమీఁ బనిగాదు మరి యేమిగలిగినా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకు నేమీఁ బనిగాదు మరి యేమిగలిగినా శ్రీకాంతు నడుగరో చిత్రగుప్తులాల (॥మాకు॥) ధరణీశుపనులకుఁ దగు బందె లేదట హరిదాసులకుఁ బాపమంటునా మరి సరిఁ జక్రపుడాగు లిచ్చటఁ జూచుకోరో మీరు అరసి మీఁదటిమాట లాతని నడుగరో (॥మాకు॥) లావరిమన్ననపాత్రులకు వెట్టి లేదట కావింప వైష్ణువులకుఁ గర్మమున్నదా దేవునిలాంచన మిదె తిరుమణి చూచుకోరో ఆవల నేమిగల్లాను ఆతని నడుగరో (॥మాకు॥) సతి రాణివాసమైతే జాతికులమెంచరట హితశరణాగతులకేది జాతి తతి శ్రీవేంకటపతిదాస్య మిది చూచుకోరో యితవై మరేమిగల్లా నీతని నడుగరో English(||pallavi||) māgu nemīm̐ banigādu mari yemigaliginā śhrīgāṁtu naḍugaro sitraguptulāla (||māgu||) dharaṇīśhubanulagum̐ dagu baṁdĕ ledaḍa haridāsulagum̐ bābamaṁṭunā mari sarim̐ jakrabuḍāgu lichchaḍam̐ jūsugoro mīru arasi mīm̐daḍimāḍa lādani naḍugaro (||māgu||) lāvarimannanabātrulagu vĕṭṭi ledaḍa kāviṁpa vaiṣhṇuvulagum̐ garmamunnadā devunilāṁchana midĕ tirumaṇi sūsugoro āvala nemigallānu ādani naḍugaro (||māgu||) sadi rāṇivāsamaide jādigulamĕṁcharaḍa hidaśharaṇāgadulagedi jādi tadi śhrīveṁkaḍabadidāsya midi sūsugoro yidavai maremigallā nīdani naḍugaro