Title (Indic)మాకేఁటికి దాఁచేరు మర్మములు మీలోనివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకేఁటికి దాఁచేరు మర్మములు మీలోనివి మేకొన్న రతులకు మీమేనులే గురి (॥మాకేఁ॥) పొలఁతికి మీకును పొందులైనందుకు మీ సెలవినవ్వులలోనిసిగ్గులే గురి మెలుపుఁదమకములు మిక్కుటమైనందుకు సొలపుఁగనుసన్నలచూపులే గురి (॥మాకే॥) యెందును మీతలపోఁత లీడేరినందుకు కందువ మీమోములకళలే గురి అందుకొని మీమనసు లట్టె కరఁగినందుకు చిందేటిమీచెమటలచిత్తడే గురి (॥మాకే॥) వేమరు మీరు వెరచి వెరపుదేరినందుకు మాముందర మీరాడేమాటలే గురి యీమేర శ్రీవేంకటేశ నన్ను నేలితివి ఆమనివేడుకల కొయ్యారాలే గురి English(||pallavi||) māgem̐ṭigi dām̐seru marmamulu mīlonivi megŏnna radulagu mīmenule guri (||māgem̐||) pŏlam̐tigi mīgunu pŏṁdulainaṁdugu mī sĕlavinavvulalonisiggule guri mĕlubum̐damagamulu mikkuḍamainaṁdugu sŏlabum̐ganusannalasūbule guri (||māge||) yĕṁdunu mīdalabom̐ta līḍerinaṁdugu kaṁduva mīmomulagaḽale guri aṁdugŏni mīmanasu laṭṭĕ karam̐ginaṁdugu siṁdeḍimīsĕmaḍalasittaḍe guri (||māge||) vemaru mīru vĕrasi vĕrabuderinaṁdugu māmuṁdara mīrāḍemāḍale guri yīmera śhrīveṁkaḍeśha nannu nelidivi āmaniveḍugala kŏyyārāle guri