Title (Indic)మాకేఁటి కోపములు మగవారితోడ నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకేఁటి కోపములు మగవారితోడ నేఁడు చేకొని నీవు నాచెక్కు నొక్కఁగను (॥వకే॥) చిత్తము చీఁకటి వాసె సెలవి నీవు నవ్వి పొత్తుకుఁ బిలిచి బుజ్జగించఁగా వత్తికి నూనెకు నొక్కవరుసాయ నలుకలు హత్తి నీవే సేసవెట్టితల్లనాఁడే నాకు (॥వకే॥) చలములన్నియుఁ దీరె సరసము నీవాడి పలుకులనాదరించి పంతమీయఁగా చలుములు బలుములు సరికి బేసికి ముంచె నిలిచిన నిలువుకే నీవు మన్నించితివి (॥వకే॥) తనువుపై కాఁకమానె దగ్గరఁ బెట్టుక నీవు కనుచూపులఁ దేలించి కాఁగిలించఁగా వినయాలు వేడుకలు వీడుదోళ్లాడె నిదె యెనసితివి శ్రీవేంకటేశ నన్నిపుడు English(||pallavi||) māgem̐ṭi kobamulu magavāridoḍa nem̐ḍu segŏni nīvu nāsĕkku nŏkkam̐ganu (||vage||) sittamu sīm̐kaḍi vāsĕ sĕlavi nīvu navvi pŏttugum̐ bilisi bujjagiṁcham̐gā vattigi nūnĕgu nŏkkavarusāya nalugalu hatti nīve sesavĕṭṭidallanām̐ḍe nāgu (||vage||) salamulanniyum̐ dīrĕ sarasamu nīvāḍi palugulanādariṁchi paṁtamīyam̐gā salumulu balumulu sarigi besigi muṁchĕ nilisina niluvuge nīvu manniṁchidivi (||vage||) tanuvubai kām̐kamānĕ daggaram̐ bĕṭṭuga nīvu kanusūbulam̐ deliṁchi kām̐giliṁcham̐gā vinayālu veḍugalu vīḍudoḽlāḍĕ nidĕ yĕnasidivi śhrīveṁkaḍeśha nannibuḍu