Title (Indic)మాకేమి పని నీ మర్మాలెత్తను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకేమి పని నీ మర్మాలెత్తను కాకుసేయఁ బనిగద్దా కమ్మటి నీ సుద్దులు (॥॥) వొప్పుగొని మోనముతో నూరకే వుండుటే మేలు చెప్పనేల నీగుణాలు చెలులతోడ చొప్పువట్టి కన్నులనుఁ జూచుకొంటా నుంటే మేలు కప్పనేల నీమేని కందువ గురుతులు (॥॥) పవ్వళించి పానుపుపై పంతాన నుండుటే మేలు నవ్వనేల నీచేఁతకు నలుగురిలో వువ్విళ్ళూర లోలోనే వూఁకొంటానుంటే మేలు రవ్వ సేయనేల నీరతిలో వినయము (॥॥) గద్దించి కాఁగిట నిన్నుఁ గలసినదే మేలు తిద్దనేల నీనేరాలు దెచ్చి సభలో వొద్దికై శ్రీవేంకటేశ వొడఁబాట్లివే మేలు వద్దనఁగనేల నీవుద్దండపు సేఁతలు English(||pallavi||) māgemi pani nī marmālĕttanu kāguseyam̐ banigaddā kammaḍi nī suddulu (||||) vŏppugŏni monamudo nūrage vuṁḍuḍe melu sĕppanela nīguṇālu sĕluladoḍa sŏppuvaṭṭi kannulanum̐ jūsugŏṁṭā nuṁṭe melu kappanela nīmeni kaṁduva gurudulu (||||) pavvaḽiṁchi pānububai paṁtāna nuṁḍuḍe melu navvanela nīsem̐tagu nalugurilo vuvviḽḽūra lolone vūm̐kŏṁṭānuṁṭe melu ravva seyanela nīradilo vinayamu (||||) gaddiṁchi kām̐giḍa ninnum̐ galasinade melu tiddanela nīnerālu dĕchchi sabhalo vŏddigai śhrīveṁkaḍeśha vŏḍam̐bāṭlive melu vaddanam̐ganela nīvuddaṁḍabu sem̐talu