Title (Indic)మాకేమి నీకరుణ మహాప్రసాద మనేము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకేమి నీకరుణ మహాప్రసాద మనేము నీకు నీ దాసుల చేతినింద బెట్టుగాదా (॥మాకే॥) పమ్మి మిమ్ముఁ గొలిచినబంట్లఁ బరులు దమ సొమ్మనుచుఁ దియ్యగాఁ జూచేదా వుమ్మడి నీవిందుకెల్లా నూరకున్నఁగన మిమ్ము నమ్ముమన్న వేదాలయానతి కొంచెపడదా (॥మాకే॥) నీముద్ర మోచినవారి నీచులు దడవఁగాను యీమేర నడ్డమురాక యిట్లుండేదా వోమక నీవీవేళ నూరకున్న నల్లనాఁటి- సామజముఁ గాచినది సందేహించఁబడదా (॥మాకే॥) మీరు మన్నించినవారు మీవాకిలి గావ కేడో- వారి వాకిలి గావఁగా వద్దనరాదా నేరిచి శ్రీవేంకటేశ నేఁడు నన్నుఁ గావకున్న ధారుణి మీ దయే మిమ్ముఁ దప్పులెంచుకొనదా English(||pallavi||) māgemi nīgaruṇa mahāprasāda manemu nīgu nī dāsula sediniṁda bĕṭṭugādā (||māge||) pammi mimmum̐ gŏlisinabaṁṭlam̐ barulu dama sŏmmanusum̐ diyyagām̐ jūsedā vummaḍi nīviṁdugĕllā nūragunnam̐gana mimmu nammumanna vedālayānadi kŏṁchĕbaḍadā (||māge||) nīmudra mosinavāri nīsulu daḍavam̐gānu yīmera naḍḍamurāga yiṭluṁḍedā vomaga nīvīveḽa nūragunna nallanām̐ṭi- sāmajamum̐ gāsinadi saṁdehiṁcham̐baḍadā (||māge||) mīru manniṁchinavāru mīvāgili gāva keḍo- vāri vāgili gāvam̐gā vaddanarādā nerisi śhrīveṁkaḍeśha nem̐ḍu nannum̐ gāvagunna dhāruṇi mī daye mimmum̐ dappulĕṁchugŏnadā