Title (Indic)మాకేమి బుద్ధి చెప్పేవు మాటి మాటికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకేమి బుద్ధి చెప్పేవు మాటి మాటికి జోకలతో నీవాపెకు చుట్టమవే కావా (॥మాకే॥) మక్కువ గలవాఁడవు మానిని వేఁడుకోరాదా చెక్కుచేతితోడ లోనఁ జింతించీని యెక్కువ తక్కువ మాటలిద్దరము నాడుకొంటే చొక్కముగా నీవాపెకు చుట్టమవే కావా (॥మాకే॥) నగవులవాఁడవు నవ్వించరాదా ఆపెను వగ విరహానఁ దలవంచు కున్నది యెగసక్యాలు మాలోనెటువలెనుండినాను సొగసి నీవాపెకు చుట్టమవే కావా (॥మాకే॥) అట్టె చెనకేవాఁడవాపె చెక్కు నొక్కరాదా దట్టపు నీరతిఁగూడి దగ్గరున్నది గుట్టున శ్రీవేంకటేశ కోరినన్నుఁ గూడితివి చుట్టిచుట్టి తొల్లేపెకు చుట్టమవే కావా English(||pallavi||) māgemi buddhi sĕppevu māḍi māḍigi jogalado nīvābĕgu suṭṭamave kāvā (||māge||) makkuva galavām̐ḍavu mānini vem̐ḍugorādā sĕkkusedidoḍa lonam̐ jiṁtiṁchīni yĕkkuva takkuva māḍaliddaramu nāḍugŏṁṭe sŏkkamugā nīvābĕgu suṭṭamave kāvā (||māge||) nagavulavām̐ḍavu navviṁcharādā ābĕnu vaga virahānam̐ dalavaṁchu kunnadi yĕgasakyālu mālonĕḍuvalĕnuṁḍinānu sŏgasi nīvābĕgu suṭṭamave kāvā (||māge||) aṭṭĕ sĕnagevām̐ḍavābĕ sĕkku nŏkkarādā daṭṭabu nīradim̐gūḍi daggarunnadi guṭṭuna śhrīveṁkaḍeśha korinannum̐ gūḍidivi suṭṭisuṭṭi tŏllebĕgu suṭṭamave kāvā