Title (Indic)మాకేలే ఇటువంటి మందెమేళాలు తనతో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకేలే ఇటువంటి మందెమేళాలు తనతో మేకొని సేవలుసేసి మెప్పించుటగాక (॥మాకే॥) వేడుకకత్తెలకు వేసాలు సేయవచ్చు చూడఁగానే యెంతైనా సొలయవచ్చు పాడిపంతా లెంతైనాఁ బచారించఁగవచ్చు యేడనుఁడైనా తన్ను నెలఇంచవచ్చును (॥మాకే॥) కన్నులను జంకించి కాఁతాళించఁగవచ్చు సన్నలుసేసి వూరకే సాదించవచ్చు విన్నపాలు సేసిసేసి వేడుకలు రేఁచవచ్చు చన్నుల నొత్తుచు లోలో జరయఁగవచ్చును (॥మాకే॥) చేయరానిచేఁత సేసి చెక్కులు నొక్కఁగవచ్చు వేయిమాటలైనా నాడి వేఁడుకోవచ్చు యీయెడ శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను చాయతో నన్నేలె నిఁక సమ్మతించవచ్చును English(||pallavi||) māgele iḍuvaṁṭi maṁdĕmeḽālu tanado megŏni sevalusesi mĕppiṁchuḍagāga (||māge||) veḍugagattĕlagu vesālu seyavachchu sūḍam̐gāne yĕṁtainā sŏlayavachchu pāḍibaṁtā lĕṁtainām̐ basāriṁcham̐gavachchu yeḍanum̐ḍainā tannu nĕla̮iṁchavachchunu (||māge||) kannulanu jaṁkiṁchi kām̐tāḽiṁcham̐gavachchu sannalusesi vūrage sādiṁchavachchu vinnabālu sesisesi veḍugalu rem̐savachchu sannula nŏttusu lolo jarayam̐gavachchunu (||māge||) seyarānisem̐ta sesi sĕkkulu nŏkkam̐gavachchu veyimāḍalainā nāḍi vem̐ḍugovachchu yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu sāyado nannelĕ nim̐ka sammadiṁchavachchunu