Title (Indic)మాకేల విన్నవించ మాపు దాఁకా నీతోను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకేల విన్నవించ మాపు దాఁకా నీతోను దాకొని నీవే దయఁదలఁచేవు గాని (॥॥) హత్తి రమణి విలిచీ నాడకు విచ్చేయరాదా చిత్తము వచ్చినట్లాఁజేసేవుగాని మొత్తమి నిపుడే నీవు మొగము చూడఁగరాదా యిత్తల నన్నియు నీవే యొఱిఁగేవు గాని (॥॥) మనసిచ్చి యేకతాన మాటలాడి చూడరాదా పనివడి నీవే నిజపట్టేవుగాని చెనకుచుఁ బానుపుపైఁజేరి కూచుండఁగరాదా ననిచి మానిజమెల్లా నమ్మేవుగాని (॥॥) కక్కసమేఁటికి యాకెఁ గాఁగిలించి కూడరాదా మిక్కిలి శ్రీ వేంకటేశ మెచ్చేవుగాని యిక్కువ నిప్పట్టిపొందు యిట్టె యీడేరించరాదా మక్కువలు నేసి నీవే మరిగేవు గాని English(||pallavi||) māgela vinnaviṁcha mābu dām̐kā nīdonu dāgŏni nīve dayam̐dalam̐sevu gāni (||||) hatti ramaṇi vilisī nāḍagu vichcheyarādā sittamu vachchinaṭlām̐jesevugāni mŏttami nibuḍe nīvu mŏgamu sūḍam̐garādā yittala nanniyu nīve yŏṟim̐gevu gāni (||||) manasichchi yegadāna māḍalāḍi sūḍarādā panivaḍi nīve nijabaṭṭevugāni sĕnagusum̐ bānububaim̐jeri kūsuṁḍam̐garādā nanisi mānijamĕllā nammevugāni (||||) kakkasamem̐ṭigi yāgĕm̐ gām̐giliṁchi kūḍarādā mikkili śhrī veṁkaḍeśha mĕchchevugāni yikkuva nippaṭṭibŏṁdu yiṭṭĕ yīḍeriṁcharādā makkuvalu nesi nīve marigevu gāni