Title (Indic)మాకేల వాదులడువ మాఁటిమాఁటికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకేల వాదులడువ మాఁటిమాఁటికి యీ కడను నీ మతకము ఇంతయు నేఁ గంటిని (॥॥) వలతు నంటాఁ జెప్పి వారి వీరి తోడుతను మెలుపున నీసతి యెమ్మెలు చూపీని చలివాసి తిరిగీని సవతుల ముందరను సలిగె నీవిచ్చినదే సతముగాఁ గంటిమి (॥॥) నీ విచ్చిన సొమ్ము లివి నెలఁతలకెల్లఁ జూపి దేవులతనమెల్లా నిందే నెరపీని చేవదేరెఁ బనులెల్లా సిగ్గులు వడదిప్పుడు భావింప నీపోలికెల్లాఁ బడఁతిపైఁ గంటిమి (॥॥) కాఁగిట నిన్నుఁ గూడి కాంతలలో మెరసీని రాఁగి నీవు నన్నేలితే రవ్వసేసీని పాఁగెను శ్రీవేంకటేశ పచ్చిదేరించె నీమేను నాఁగువారే పొందు లీకె నవ్వులలోఁగంటిమి English(||pallavi||) māgela vādulaḍuva mām̐ṭimām̐ṭigi yī kaḍanu nī madagamu iṁtayu nem̐ gaṁṭini (||||) valadu naṁṭām̐ jĕppi vāri vīri toḍudanu mĕlubuna nīsadi yĕmmĕlu sūbīni salivāsi tirigīni savadula muṁdaranu saligĕ nīvichchinade sadamugām̐ gaṁṭimi (||||) nī vichchina sŏmmu livi nĕlam̐talagĕllam̐ jūbi devuladanamĕllā niṁde nĕrabīni sevaderĕm̐ banulĕllā siggulu vaḍadippuḍu bhāviṁpa nīboligĕllām̐ baḍam̐tibaim̐ gaṁṭimi (||||) kām̐giḍa ninnum̐ gūḍi kāṁtalalo mĕrasīni rām̐gi nīvu nannelide ravvasesīni pām̐gĕnu śhrīveṁkaḍeśha pachchideriṁchĕ nīmenu nām̐guvāre pŏṁdu līgĕ navvulalom̐gaṁṭimi