Title (Indic)మాకేల దాఁచేవే మగువ నీ మోహము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకేల దాఁచేవే మగువ నీ మోహము ఆకడ నీమాటలకు నే మడ్డమాడేమా (॥వకే॥) నిండినచెమటనీరు నీచెక్కుల నుండఁ గ యెండనేలే నీమోవి యెదురెదుర రెండురెంటా వేయనేలే రీతులైన నీ చన్నులు వుండనుండఁ గానవచ్చె నువిద నీసుద్దులు (॥వకే॥) యెక్కువనీమేనికాఁ క యెండలుగాయఁ గాను ముక్కులై పులకలేల మోసులోత్తీనే చిక్కనినెరిఁ గురుల చీఁ కటేల చల్లేవే తెక్కులనే తేటపడె తేజుపునీగుణము (॥వకే॥) భారపునిట్టూర్పుగాలి పచ్చిదేర విసరఁ గా గారవానఁ గోవిలలు గళము చేరె కోరి శ్రీవేంకటపతిఁ గూడితివిగాఁ బోలు ఆరితేరె నీగుట్టు అంతయు మాయెదుట English(||pallavi||) māgela dām̐seve maguva nī mohamu āgaḍa nīmāḍalagu ne maḍḍamāḍemā (||vage||) niṁḍinasĕmaḍanīru nīsĕkkula nuṁḍam̐ ga yĕṁḍanele nīmovi yĕdurĕdura rĕṁḍurĕṁṭā veyanele rīdulaina nī sannulu vuṁḍanuṁḍam̐ gānavachchĕ nuvida nīsuddulu (||vage||) yĕkkuvanīmenigām̐ ka yĕṁḍalugāyam̐ gānu mukkulai pulagalela mosulottīne sikkaninĕrim̐ gurula sīm̐ kaḍela salleve tĕkkulane teḍabaḍĕ tejubunīguṇamu (||vage||) bhārabuniṭṭūrbugāli pachchidera visaram̐ gā gāravānam̐ govilalu gaḽamu serĕ kori śhrīveṁkaḍabadim̐ gūḍidivigām̐ bolu āriderĕ nīguṭṭu aṁtayu māyĕduḍa