Title (Indic)మాతోనింకానా మజ్జాతాయను మాకు (?) WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాతోనింకానా మజ్జాతాయను మాకు (?) చేతికి లోనైనమీఁదఁ జెప్పవలెనా (॥మాతో॥) జంగిలి సతుల నీవు సారెసారె నమ్మించఁగా అంగడిఁ బడీనవె నీ అన్నమాటలు యెంగిలిగా నీమోవి యెవ్వరైనాఁ జేయఁగాను ముంగిట మెరసెను నీముసిముసి నవ్వులు (॥మాతో॥) చేరి పదారువేలకు సేసలు నీవు వెట్టఁగా ఆరీతిఁ బడెనవే నీ అన్ని చేఁతలు కోరికలు మించినట్టి కొలనిసతులచేత నీరువంక తుంగైనవి నీగుణాలు (॥మాతో॥) యింపుల రాచకూఁతురునెత్తుక నీవు రాఁగానే సంపద మించినవి నీచతురతలు ముంపున శ్రీవెంకటేశ ముందె నన్నుఁ గూడితివి చెంపల నిలిచెను నీసిగ్గులెల్లాను English(||pallavi||) mādoniṁkānā majjādāyanu māgu (?) sedigi lonainamīm̐dam̐ jĕppavalĕnā (||mādo||) jaṁgili sadula nīvu sārĕsārĕ nammiṁcham̐gā aṁgaḍim̐ baḍīnavĕ nī annamāḍalu yĕṁgiligā nīmovi yĕvvarainām̐ jeyam̐gānu muṁgiḍa mĕrasĕnu nīmusimusi navvulu (||mādo||) seri padāruvelagu sesalu nīvu vĕṭṭam̐gā ārīdim̐ baḍĕnave nī anni sem̐talu korigalu miṁchinaṭṭi kŏlanisadulaseda nīruvaṁka tuṁgainavi nīguṇālu (||mādo||) yiṁpula rāsagūm̐turunĕttuga nīvu rām̐gāne saṁpada miṁchinavi nīsaduradalu muṁpuna śhrīvĕṁkaḍeśha muṁdĕ nannum̐ gūḍidivi sĕṁpala nilisĕnu nīsiggulĕllānu