Title (Indic)మాతోనేల బీరాలు మాపు దాఁకా నెరపేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాతోనేల బీరాలు మాపు దాఁకా నెరపేవు ఆ తరుణి పిలిచితే నౌఁగాదనఁగలవా (॥మాతో॥) రంతులెంత సేసినాను రాజసము చూపినాను చెంతల నింతికి నీవు చేతికిలోనే పంతము లెన్నాడినాను పైపై నెంతపెనఁగినా మంతనానఁ జెలితోను మారుకొనఁగలవా (॥మాతో॥) దీకొనెంత తిట్టినాను దిమ్మరివై వొరసినా చేకొన్నసతికి నీవు చేతికిలోనే బూక లెంత సేసినాను బుద్దులెన్ని నేరిచినా మేకొన్న యీవనితను మితిమీరఁగలవా (॥మాతో॥) కోరి యెంత జంకించినా గుబ్బలెంత పిసికినా చేరికూడినకాంతకు చేతికిలోనే యీరీతి శ్రీవేంకటేశ యింకా నెట్లుండినా సారెకు నీలేమతోడ సరిదూఁగఁగలవా English(||pallavi||) mādonela bīrālu mābu dām̐kā nĕrabevu ā taruṇi piliside naum̐gādanam̐galavā (||mādo||) raṁtulĕṁta sesinānu rājasamu sūbinānu sĕṁtala niṁtigi nīvu sedigilone paṁtamu lĕnnāḍinānu paibai nĕṁtabĕnam̐ginā maṁtanānam̐ jĕlidonu mārugŏnam̐galavā (||mādo||) dīgŏnĕṁta tiṭṭinānu dimmarivai vŏrasinā segŏnnasadigi nīvu sedigilone būga lĕṁta sesinānu buddulĕnni nerisinā megŏnna yīvanidanu midimīram̐galavā (||mādo||) kori yĕṁta jaṁkiṁchinā gubbalĕṁta pisiginā serigūḍinagāṁtagu sedigilone yīrīdi śhrīveṁkaḍeśha yiṁkā nĕṭluṁḍinā sārĕgu nīlemadoḍa saridūm̐gam̐galavā