Title (Indic)మాతోఁ జెప్పఁగదవే మగువ నీ సుద్దులెల్లా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాతోఁ జెప్పఁగదవే మగువ నీ సుద్దులెల్లా యీతల నీ వేడుకలు ఇన్నీ నేఁడుఁ గంటిమి (॥మాతో॥) కన్నులఁ దేటలు నిండె కమ్మి మైఁ జెమట లూరె వున్నతి యిందాఁకా నెందునుండి వస్తివే సన్నపు నీ పెదవులు చాలాఁ బిప్పులు గట్టె పన్ని యెవ్వరితో మాట పలుకు లాడితివే (॥మాతో॥) గట్టి కొప్పు వెడ జారె కళలు మోమునఁదేరె అట్టె యేపనుల నీ వలసితివే కట్టిన చెంగావిచీర కడు నెరి విరిగెను(వీఁగెను) బెట్టి(ట్టు) నీ వెవ్వరితోడఁ బెనఁగితివే (॥మాతో॥) సెలవినవ్వు మెరసె చేఁతలు మేన నెరసె అలరి సంతోస మెట్లబ్బెనే నీకు అలమేలుమంగపతియైన శ్రీ వేంకటేశుఁడు కలసెనో నిన్ను నే భాగ్యములు సేసితివే English(||pallavi||) mādom̐ jĕppam̐gadave maguva nī suddulĕllā yīdala nī veḍugalu innī nem̐ḍum̐ gaṁṭimi (||mādo||) kannulam̐ deḍalu niṁḍĕ kammi maim̐ jĕmaḍa lūrĕ vunnadi yiṁdām̐kā nĕṁdunuṁḍi vastive sannabu nī pĕdavulu sālām̐ bippulu gaṭṭĕ panni yĕvvarido māḍa palugu lāḍidive (||mādo||) gaṭṭi kŏppu vĕḍa jārĕ kaḽalu momunam̐derĕ aṭṭĕ yebanula nī valasidive kaṭṭina sĕṁgāvisīra kaḍu nĕri virigĕnu(vīm̐gĕnu) bĕṭṭi(ṭṭu) nī vĕvvaridoḍam̐ bĕnam̐gidive (||mādo||) sĕlavinavvu mĕrasĕ sem̐talu mena nĕrasĕ alari saṁtosa mĕṭlabbĕne nīgu alamelumaṁgabadiyaina śhrī veṁkaḍeśhum̐ḍu kalasĕno ninnu ne bhāgyamulu sesidive