Title (Indic)మాతోడి గొడవేల మాపు దాఁకాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాతోడి గొడవేల మాపు దాఁకాను యేతులకు వెంటవచ్చే విది యేమోకాక (॥మాతో ॥) సింగారించఁగానే ఆపెచేతికి లోనైతివి వుంగరపువేలిగోరి కొరవైతివి కంగినతిట్ల కెల్ల కణఁజమైతివి పంగెనమానిసి వింక పనికివచ్చేవా (॥మాతో॥) కమ్మటి నాపెమోవికిఁ గంచమవైతివి దొమ్మిచూపులబందెకు దొడ్డివైతివి పమ్మిననవ్వులకెల్లా పడిగమవైతివి వుమ్మడివాఁడవు నీకు నున్నదా స్వతంత్రము (॥మాతో॥) కలికిరతులకెల్లా గద్దెవు నీవైతివి వలపులపంటకెల్ల వామివైతివి బలిమి శ్రీవేంకటేశ పైకొని న న్నేలితివి వలరాచకయ్యాన నీవంక వేసటున్నదా English(||pallavi||) mādoḍi gŏḍavela mābu dām̐kānu yedulagu vĕṁṭavachche vidi yemogāga (||mādo ||) siṁgāriṁcham̐gāne ābĕsedigi lonaidivi vuṁgarabuveligori kŏravaidivi kaṁginadiṭla kĕlla kaṇam̐jamaidivi paṁgĕnamānisi viṁka panigivachchevā (||mādo||) kammaḍi nābĕmovigim̐ gaṁchamavaidivi dŏmmisūbulabaṁdĕgu dŏḍḍivaidivi pamminanavvulagĕllā paḍigamavaidivi vummaḍivām̐ḍavu nīgu nunnadā svadaṁtramu (||mādo||) kaligiradulagĕllā gaddĕvu nīvaidivi valabulabaṁṭagĕlla vāmivaidivi balimi śhrīveṁkaḍeśha paigŏni na nnelidivi valarāsagayyāna nīvaṁka vesaḍunnadā