Title (Indic)మాతో నేఁటికి నేను మగువ నింతే । నీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాతో నేఁటికి నేను మగువ నింతే । నీ- చేఁతలెల్ల యేడనైనాఁ జేయవయ్యా (॥మాతో॥) జలధి యీఁదేచోట, శైలము మోచేచోట సొలసి నీబలిమెల్లఁ జూపవయ్యా యిల దవ్వఁబోవుచోట, హిరణ్యునిఁ జంపుచోట పలుకుఁబంతాలెల్లఁ బచరించవయ్యా (॥మాతో॥) నీవు మిన్నందేచోట, నెత్తుటఁ దోఁగే చోట సోవల నీమురిపేలు చూపవయ్యా దీవుల కేఁగేచోట, తెగి వెన్న దినుచోట చేవదేర మాయలెల్లాఁ జేయవయ్యా (॥మాతో॥) సిగ్గులదేరుచోట, చెంతలఁ బారేచోట యెగ్గులుదప్పులుఁ బోయి యెంచవయ్యా అగ్గమైతి శ్రీవేంకటాధిప నన్నుఁ గూడి వెగ్గళపుకపటాలు విడువవయ్యా English(||pallavi||) mādo nem̐ṭigi nenu maguva niṁte | nī- sem̐talĕlla yeḍanainām̐ jeyavayyā (||mādo||) jaladhi yīm̐desoḍa, śhailamu mosesoḍa sŏlasi nībalimĕllam̐ jūbavayyā yila davvam̐bovusoḍa, hiraṇyunim̐ jaṁpusoḍa palugum̐baṁtālĕllam̐ basariṁchavayyā (||mādo||) nīvu minnaṁdesoḍa, nĕttuḍam̐ dom̐ge soḍa sovala nīmuribelu sūbavayyā dīvula kem̐gesoḍa, tĕgi vĕnna dinusoḍa sevadera māyalĕllām̐ jeyavayyā (||mādo||) sigguladerusoḍa, sĕṁtalam̐ bāresoḍa yĕgguludappulum̐ boyi yĕṁchavayyā aggamaidi śhrīveṁkaḍādhiba nannum̐ gūḍi vĕggaḽabugabaḍālu viḍuvavayyā