Title (Indic)మాతో నేమిచెప్పేవే మాపు దాఁకాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాతో నేమిచెప్పేవే మాపు దాఁకాను ఆతనిని చిలుకచే నాడించవలదా (॥మాతో ॥) చేరి నవ్వవచ్చుఁగాక చేయిసోఁకఁ జెనకితే వోరుచు కెవ్వరికైనా నుండవచ్చునా ధీరత ఇంతలేకుండితే నప్పుడే యతనిపై కోరి వేరొకటివెట్టి దూరుసేయవలదా (॥మాతో ॥) జూదమాడవచ్చుఁగాక సులభాన గెలిచితే వాదులేక యీను విడువఁగవచ్చునా పాదుకొని నీవింత పంతమాడేదానవు మోదపు నీచెలులచే మోసపుచ్చవలదా (॥మాతో॥) తమి రెఁచవచ్చుఁగాక తగురతిఁ గినిసితే తెమల కందుకు సమ్మతించవచ్చునా అమర శ్రీవేంకటేశు నటు గూడినదానవు మముబోంట్లచే మారుమలయించవలదా English(||pallavi||) mādo nemisĕppeve mābu dām̐kānu ādanini silugase nāḍiṁchavaladā (||mādo ||) seri navvavachchum̐gāga seyisom̐kam̐ jĕnagide vorusu kĕvvarigainā nuṁḍavachchunā dhīrada iṁtaleguṁḍide nappuḍe yadanibai kori verŏgaḍivĕṭṭi dūruseyavaladā (||mādo ||) jūdamāḍavachchum̐gāga sulabhāna gĕliside vādulega yīnu viḍuvam̐gavachchunā pādugŏni nīviṁta paṁtamāḍedānavu modabu nīsĕlulase mosabuchchavaladā (||mādo||) tami rĕm̐savachchum̐gāga taguradim̐ giniside tĕmala kaṁdugu sammadiṁchavachchunā amara śhrīveṁkaḍeśhu naḍu gūḍinadānavu mamuboṁṭlase mārumalayiṁchavaladā