Title (Indic)మాతో నేమిచెప్పేరే మగువలాల సుద్దులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాతో నేమిచెప్పేరే మగువలాల సుద్దులు ఆతఁడే నేరుచు మిమ్ము నంకెకు రాఁజేయను (॥మాతో॥) సవతిమచ్చరములు సరుస రేఁచినవాఁడు తివిరి మీతగవులు దిద్దనేరఁడా చవిగొని మీ మోవులు చప్పఁగాఁ జేసినవాఁడు కవగూడియుండఁగ నొక్కటిసేయనేరఁడా (॥మాతో॥) పంతములు మీలోమీకు పైపై నెక్కించినవాఁడు బంతినే మీబలి మేర్పరచనేరఁడా ఇంతలో మీ చక్కఁదనా లీడువెట్టి చూచేవాఁడు చింతదీర మిమ్ము సంతోసించనేరఁడా (॥మాతో॥) తడయక మిమ్ముఁగూడి తమివుట్టించినవాఁడు చిడుముడినిచ్చకాలు సేయనేరఁడా అడరి శ్రీవేంకటేశు డాతఁడే నన్నేలినాఁడు జడిగొని అందరికి జనవియ్యనేరఁడా English(||pallavi||) mādo nemisĕppere maguvalāla suddulu ādam̐ḍe nerusu mimmu naṁkĕgu rām̐jeyanu (||mādo||) savadimachcharamulu sarusa rem̐sinavām̐ḍu tiviri mīdagavulu diddaneram̐ḍā savigŏni mī movulu sappam̐gām̐ jesinavām̐ḍu kavagūḍiyuṁḍam̐ga nŏkkaḍiseyaneram̐ḍā (||mādo||) paṁtamulu mīlomīgu paibai nĕkkiṁchinavām̐ḍu baṁtine mībali merbarasaneram̐ḍā iṁtalo mī sakkam̐danā līḍuvĕṭṭi sūsevām̐ḍu siṁtadīra mimmu saṁtosiṁchaneram̐ḍā (||mādo||) taḍayaga mimmum̐gūḍi tamivuṭṭiṁchinavām̐ḍu siḍumuḍinichchagālu seyaneram̐ḍā aḍari śhrīveṁkaḍeśhu ḍādam̐ḍe nannelinām̐ḍu jaḍigŏni aṁdarigi janaviyyaneram̐ḍā