Title (Indic)మాతో నేమి చెప్పేవు మాపు దాఁకాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాతో నేమి చెప్పేవు మాపు దాఁకాను యీ తరవాతనే నీవు యియ్యవయ్య చనవు (॥॥) అనరాదుగాక నిన్ను ఆపెయెదుటనే నీవు ననిచి వేరొకతెతో నవ్వనేఁటికి మనసిచ్చి యందుకుఁగా మాటలాడదాయ నేమో పెనఁగి చేవట్టితీసి పెట్టవయ్య విడెము (॥॥) ఱట్టు సేయరాదుగాక నెట్టవ సతిచెలితో- నట్టె నీవు జూజము లాడవచ్చునా ఇట్టె యిందుకుఁగానే ఇంటిలోనే వున్నదేమో గుట్టున వద్దఁ గూచుండి కూడవయ్య కాఁగిట (॥॥) తప్పు మోపరాదుగాక తరుణి నిట్టె కూడి కప్పులు దేరఁగ మోవి గంటి సేతురా చిప్పిలి యిందుకుఁగాను సిగ్గుపడి వున్నదేమో అప్పటి శ్రీ వేంకటేశ చెప్పవయ్య ప్రియము English(||pallavi||) mādo nemi sĕppevu mābu dām̐kānu yī taravādane nīvu yiyyavayya sanavu (||||) anarādugāga ninnu ābĕyĕduḍane nīvu nanisi verŏgadĕdo navvanem̐ṭigi manasichchi yaṁdugum̐gā māḍalāḍadāya nemo pĕnam̐gi sevaṭṭidīsi pĕṭṭavayya viḍĕmu (||||) ṟaṭṭu seyarādugāga nĕṭṭava sadisĕlido- naṭṭĕ nīvu jūjamu lāḍavachchunā iṭṭĕ yiṁdugum̐gāne iṁṭilone vunnademo guṭṭuna vaddam̐ gūsuṁḍi kūḍavayya kām̐giḍa (||||) tappu mobarādugāga taruṇi niṭṭĕ kūḍi kappulu deram̐ga movi gaṁṭi sedurā sippili yiṁdugum̐gānu siggubaḍi vunnademo appaḍi śhrī veṁkaḍeśha sĕppavayya priyamu