Title (Indic)మాతో నేల తన కింత మచ్చరాలు నీవె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాతో నేల తన కింత మచ్చరాలు నీవె పోతరించిన యాపెకు బుద్ది చెప్పరాదా (॥మాతో॥) పక్కన నీతో నేను పదరి నవ్వితి నంటా అక్కడనుండె సణఁగు లాపె ఆడీని తక్కి చలిమి బలిమి తన కింత గలితేను చిక్కించుక నిన్నేమైనాఁ జేయఁగ వలెఁబో (॥మాతో॥) మంచముపై నీవు నేను మరిగి వున్నారమని యించుకంత చూడ నోప కీసడించీని నించి తన కంతేసి నేరుపే కలిగితేను అంచల నిన్ను రప్పించి అదలింవలెఁ బో (॥మాతో॥) కందువ నీవు నన్నుఁ గాఁగిట గూడితి వంటా చెంది లోలోనే తాను చిన్నఁ బోయ్యిని యిందుకు శ్రీవెంకటేశ యిన్నిటా తా జా ణైతేఁ బొంది యిచ్చకము నేసి పొదుగఁగ వలెఁబో English(||pallavi||) mādo nela tana kiṁta machcharālu nīvĕ podariṁchina yābĕgu buddi sĕpparādā (||mādo||) pakkana nīdo nenu padari navvidi naṁṭā akkaḍanuṁḍĕ saṇam̐gu lābĕ āḍīni takki salimi balimi tana kiṁta galidenu sikkiṁchuga ninnemainām̐ jeyam̐ga valĕm̐bo (||mādo||) maṁchamubai nīvu nenu marigi vunnāramani yiṁchugaṁta sūḍa noba kīsaḍiṁchīni niṁchi tana kaṁtesi nerube kaligidenu aṁchala ninnu rappiṁchi adaliṁvalĕm̐ bo (||mādo||) kaṁduva nīvu nannum̐ gām̐giḍa gūḍidi vaṁṭā sĕṁdi lolone tānu sinnam̐ boyyini yiṁdugu śhrīvĕṁkaḍeśha yinniḍā tā jā ṇaidem̐ bŏṁdi yichchagamu nesi pŏdugam̐ga valĕm̐bo