Title (Indic)మాతో నేల చెప్పేవు మాటి మాటికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాతో నేల చెప్పేవు మాటి మాటికి నీతో నవుఁగాదన నేరము నేమెన్నఁడు (॥వతో॥) తప్పని బొంకని నీ తగవులేల చెప్పేవు తప్పు నీయందేమి గల్లాఁ దడవేరా చెప్పేరు గొల్లెతలే చేరి యడుగుకోవయ్య నెప్పున నిన్నుఁ గాదన నేరము నేమెన్నఁడు (॥వతో॥) నగుచు నీ వోరుపులు నాతోనేమి చెప్పేవు జగడించినా నిన్ను సాదించేరా పగటు నీ దయలు చుప్పనాతికిఁ జెప్పవయ్య నిగిడి నిష్టూరమాడనేరము నేమెన్నఁడు (॥వతో॥) సారెకు శ్రీ వేంకటేశ సత్యాలేల చెప్పేవు కారులాడినా నిన్నుఁ గాదనేరా పోర కలమేల్మంగను బొంకు దైత్యాంగనలతో నీరతిఁ గూడనే కాని నేరము నే మెన్నఁడూ English(||pallavi||) mādo nela sĕppevu māḍi māḍigi nīdo navum̐gādana neramu nemĕnnam̐ḍu (||vado||) tappani bŏṁkani nī tagavulela sĕppevu tappu nīyaṁdemi gallām̐ daḍaverā sĕpperu gŏllĕdale seri yaḍugugovayya nĕppuna ninnum̐ gādana neramu nemĕnnam̐ḍu (||vado||) nagusu nī vorubulu nādonemi sĕppevu jagaḍiṁchinā ninnu sādiṁcherā pagaḍu nī dayalu suppanādigim̐ jĕppavayya nigiḍi niṣhṭūramāḍaneramu nemĕnnam̐ḍu (||vado||) sārĕgu śhrī veṁkaḍeśha satyālela sĕppevu kārulāḍinā ninnum̐ gādanerā pora kalamelmaṁganu bŏṁku daityāṁganalado nīradim̐ gūḍane kāni neramu ne mĕnnam̐ḍū