Title (Indic)మాతో నేల లేదనేవు మాటిమాటికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాతో నేల లేదనేవు మాటిమాటికి చేత దిష్టవై వుండఁగా చిత్తమునఁ బెట్టవు (॥మాతో॥) చన్నుల నొరసె నాపె సారె గొప్పు దువ్వేనంటా సన్న సేసి మాటలాడె సంగడి నంటా యెన్నికతో నీకాపె యిఁక నేమి సేయవలె చెన్నుమీర నింకా నీవు చిత్తమునఁ బెట్టవు (॥మాతో॥) కదిసి కూచుండేనంటా కాలు దొక్కె నంతలోనె వదినెనంటా నీతో వావి చెప్పెను యెదుట నీకు దనివి యెంతట గాని నిండదు చెదరదీవలపింకా చిత్తమునఁ బెట్టవు (॥మాతో॥) ఆకు మడిచిచ్చే నంటా ఆయములెల్లా ముట్టె చేకొనే వూడిగాలంటాఁజేరికూడెను యీకడ శ్రీ వేంకటేశ యీడా నన్నుఁ గూడితివి చీకాకు లాపెరతి చిత్తానఁ బెట్టవు English(||pallavi||) mādo nela ledanevu māḍimāḍigi seda diṣhṭavai vuṁḍam̐gā sittamunam̐ bĕṭṭavu (||mādo||) sannula nŏrasĕ nābĕ sārĕ gŏppu duvvenaṁṭā sanna sesi māḍalāḍĕ saṁgaḍi naṁṭā yĕnnigado nīgābĕ yim̐ka nemi seyavalĕ sĕnnumīra niṁkā nīvu sittamunam̐ bĕṭṭavu (||mādo||) kadisi kūsuṁḍenaṁṭā kālu dŏkkĕ naṁtalonĕ vadinĕnaṁṭā nīdo vāvi sĕppĕnu yĕduḍa nīgu danivi yĕṁtaḍa gāni niṁḍadu sĕdaradīvalabiṁkā sittamunam̐ bĕṭṭavu (||mādo||) āgu maḍisichche naṁṭā āyamulĕllā muṭṭĕ segŏne vūḍigālaṁṭām̐jerigūḍĕnu yīgaḍa śhrī veṁkaḍeśha yīḍā nannum̐ gūḍidivi sīgāgu lābĕradi sittānam̐ bĕṭṭavu