Title (Indic)మాతో నేల దాఁచేవు మర్మాలు నే మెరఁగమా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాతో నేల దాఁచేవు మర్మాలు నే మెరఁగమా యీతల నిన్నింత సేసినాతఁ డెవ్వఁడే (॥మాతో॥) తలఁ పెక్కడనో కానీ తగ మాతో మాఁటడేవు జలజాక్షివలపులజాడలే యివి నిలువు నివ్వెరగంది నేర్పున మాతో నవ్వేవు లలి లోలో కరఁగులాగులే యివి (॥మాతో॥) సేసినపను లేఁటివో సిగ్గువడేవు మావద్ద మూసి దాఁచి చెప్పరానిముచ్చటే యిది వాసిఁ జెక్కుచేతితో మావంక చూచేవు వూరకే లాసేటిరతులమీఁదియాసలే యివి (॥మాతో॥) మోమున సంతోసమదే మొరఁగు మాతోఁ జూపేవు కామతంత్రపుజాడలగతులే యివి యీమేర శ్రీవేంకటేశుఁ డిట్టె నన్ను నిదె కూడె నోములు ఫలించినవినోదాలే యివి English(||pallavi||) mādo nela dām̐sevu marmālu ne mĕram̐gamā yīdala ninniṁta sesinādam̐ ḍĕvvam̐ḍe (||mādo||) talam̐ pĕkkaḍano kānī taga mādo mām̐ṭaḍevu jalajākṣhivalabulajāḍale yivi niluvu nivvĕragaṁdi nerbuna mādo navvevu lali lolo karam̐gulāgule yivi (||mādo||) sesinabanu lem̐ṭivo sigguvaḍevu māvadda mūsi dām̐si sĕpparānimuchchaḍe yidi vāsim̐ jĕkkusedido māvaṁka sūsevu vūrage lāseḍiradulamīm̐diyāsale yivi (||mādo||) momuna saṁtosamade mŏram̐gu mādom̐ jūbevu kāmadaṁtrabujāḍalagadule yivi yīmera śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannu nidĕ kūḍĕ nomulu phaliṁchinavinodāle yivi