Title (Indic)మాతో దాఁచే వింకా మగువరో యిఁక నేలే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాతో దాఁచే వింకా మగువరో యిఁక నేలే యీతలి ఆతలి ముచ్చట యిరవులు దెలిపెడిని (॥మాతో॥) చెక్కునఁ బెట్టినచేయిని చెలిపై నొరగిన మేనుగు ముక్కునఁ బెట్టిన వేలును మోహము దెలిపెడిని తొక్కెడిపాదపు వ్రాఁతల తొడిఁబడ జారిన తురుమును వెక్కసమగు నిట్టూర్పులు విరహము దెలిపెడిని (॥మాతో॥) రెప్పలు వేయనిచూపులు రేసుల వాడిన మోవియు అప్పసమగు పెంజెమటలు ఆసలు దెలిపెడిని యెప్పుడు నేకాంతంబులు యెక్కువలగు పరవశములు తిప్పఁగరాని పరాకులు తెగువలు దెలిపెడిని (॥మాతో॥) మోమున నిండిన కళలును మోనపు సెలవుల నవ్వులు కామించిన సంభోగపు కత లివె తెలిపెడిని దోమటి దొడికెటిసిగ్గులు తోరవు సంతోషంబులు కోమలి శ్రీవేంకటపతి కూటమి దెలిపెడిని English(||pallavi||) mādo dām̐se viṁkā maguvaro yim̐ka nele yīdali ādali muchchaḍa yiravulu dĕlibĕḍini (||mādo||) sĕkkunam̐ bĕṭṭinaseyini sĕlibai nŏragina menugu mukkunam̐ bĕṭṭina velunu mohamu dĕlibĕḍini tŏkkĕḍibādabu vrām̐tala tŏḍim̐baḍa jārina turumunu vĕkkasamagu niṭṭūrbulu virahamu dĕlibĕḍini (||mādo||) rĕppalu veyanisūbulu resula vāḍina moviyu appasamagu pĕṁjĕmaḍalu āsalu dĕlibĕḍini yĕppuḍu negāṁtaṁbulu yĕkkuvalagu paravaśhamulu tippam̐garāni parāgulu tĕguvalu dĕlibĕḍini (||mādo||) momuna niṁḍina kaḽalunu monabu sĕlavula navvulu kāmiṁchina saṁbhogabu kada livĕ tĕlibĕḍini domaḍi dŏḍigĕḍisiggulu toravu saṁtoṣhaṁbulu komali śhrīveṁkaḍabadi kūḍami dĕlibĕḍini