Title (Indic)మాటలు నేరుతువే మాపుదాఁకాను వోరి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాటలు నేరుతువే మాపుదాఁకాను వోరి మాటలాడినట్టే వుండు మంతనపుఁ జేఁతలు (॥మాట॥) ఇంతలోనే నవ్వేవు యేమే చెలి అవురా యెంత కెంత కోపగించేనెందాఁకాను పంతములాడవదేమే పలుమారును నీవు అంతేసి పాడినడుపేవందుమీఁదఁ గలదా (॥మాట॥) ఇచ్చకమేల సేసేవే యింతిరో నాకు మచ్చరించితే నీవు మాట వినేవా వొచ్చెములెంచవదేమే వొక్కమాటును నిన్ను మెచ్చినందుమీఁదటను మెరమెర గలదా (॥మాట॥) కన్నులనేల మొక్కేవే కలికి నాకు నిన్ను యెన్నికె తిట్లు దిట్టి యేమి గనేరా నన్నెఱిఁగి కూడితివి జవరాలవే మన్నన శ్రీ వేంకటేశ మనసిచ్చితివిరా English(||pallavi||) māḍalu neruduve mābudām̐kānu vori māḍalāḍinaṭṭe vuṁḍu maṁtanabum̐ jem̐talu (||māḍa||) iṁtalone navvevu yeme sĕli avurā yĕṁta kĕṁta kobagiṁchenĕṁdām̐kānu paṁtamulāḍavademe palumārunu nīvu aṁtesi pāḍinaḍubevaṁdumīm̐dam̐ galadā (||māḍa||) ichchagamela seseve yiṁtiro nāgu machchariṁchide nīvu māḍa vinevā vŏchchĕmulĕṁchavademe vŏkkamāḍunu ninnu mĕchchinaṁdumīm̐daḍanu mĕramĕra galadā (||māḍa||) kannulanela mŏkkeve kaligi nāgu ninnu yĕnnigĕ tiṭlu diṭṭi yemi ganerā nannĕṟim̐gi kūḍidivi javarālave mannana śhrī veṁkaḍeśha manasichchidivirā