Title (Indic)మాటలెన్ని యాడేవే మాపు దాఁకాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాటలెన్ని యాడేవే మాపు దాఁకాను చాటువగా రమణుఁడు చనవిచ్చె నాకును (॥మాట॥) సలిగెగలదానికి సరసములాడఁజెల్లు తెలిమికత్తెకు నేమిసేసినాఁజెల్లు కలిమిగలదానికి గర్వించియుండఁజెల్లు పిలుపుగలదానికి బీరములు చెల్లునే (॥మాట॥) వొడఁబాటుగలదాని కొరసి పెనఁగఁజెల్లు బడివాయనిదానికి పంతము చెల్లు కడుఁజుట్టమైనదానిఘనతలెల్లాఁ జెల్లు వొడికముగలదాని వొప్పిదము చెల్లునే (॥మాట॥) బత్తిగలిగినదానిపగటులెల్లాఁ జెల్లు హత్తికొలిచినదానియందము చెల్లు కొత్తగా నలమేల్ మంగకుఁ బతి శ్రీవేంకటేశుఁ డిత్తల నన్ను నేలె నింపు నాకే చెల్లునే English(||pallavi||) māḍalĕnni yāḍeve mābu dām̐kānu sāḍuvagā ramaṇum̐ḍu sanavichchĕ nāgunu (||māḍa||) saligĕgaladānigi sarasamulāḍam̐jĕllu tĕlimigattĕgu nemisesinām̐jĕllu kalimigaladānigi garviṁchiyuṁḍam̐jĕllu pilubugaladānigi bīramulu sĕllune (||māḍa||) vŏḍam̐bāḍugaladāni kŏrasi pĕnam̐gam̐jĕllu baḍivāyanidānigi paṁtamu sĕllu kaḍum̐juṭṭamainadānighanadalĕllām̐ jĕllu vŏḍigamugaladāni vŏppidamu sĕllune (||māḍa||) battigaliginadānibagaḍulĕllām̐ jĕllu hattigŏlisinadāniyaṁdamu sĕllu kŏttagā nalamel maṁgagum̐ badi śhrīveṁkaḍeśhum̐ ḍittala nannu nelĕ niṁpu nāge sĕllune