Title (Indic)మాటలేమి గలిగినా మరి విన్నవించేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాటలేమి గలిగినా మరి విన్నవించేను నీటుతోడి నిన్నుఁ జూచి నేనేమనేను (॥మాట॥) చేయిమీఁదఁజేయివేసి సిగ్గుదేర మాటలాడి చాలయు సన్నలుసేసి చలివాపేవు మాయలెల్లా నేరుతువు మర్మము లెరుఁగుదువు నీయెడ కియ్యకొనక నే నేమనేను (॥మాట॥) వొడివట్టి కాలుదొక్కి వొడఁబరచుకొంటాను మడుపునవ్వులు నవ్వి మట్టుపెట్టేవు కడువేగిరకాఁడవు గర్వమెల్లానీసొమ్ము నిడివిగా మన్నించఁగ నేనేమనేను (॥మాట॥) చెలఁగి కాఁగిలించుక చెక్కులు గోరనొక్కి సొలచి రతులనెల్ల జొక్కించేవు యెలమిశ్రీవేంకటేశ యిన్నిటా జాణఁడవు నెలకొని పెండ్లాడఁగ నే నేమనేను English(||pallavi||) māḍalemi galiginā mari vinnaviṁchenu nīḍudoḍi ninnum̐ jūsi nenemanenu (||māḍa||) seyimīm̐dam̐jeyivesi siggudera māḍalāḍi sālayu sannalusesi salivābevu māyalĕllā neruduvu marmamu lĕrum̐guduvu nīyĕḍa kiyyagŏnaga ne nemanenu (||māḍa||) vŏḍivaṭṭi kāludŏkki vŏḍam̐barasugŏṁṭānu maḍubunavvulu navvi maṭṭubĕṭṭevu kaḍuvegiragām̐ḍavu garvamĕllānīsŏmmu niḍivigā manniṁcham̐ga nenemanenu (||māḍa||) sĕlam̐gi kām̐giliṁchuga sĕkkulu goranŏkki sŏlasi radulanĕlla jŏkkiṁchevu yĕlamiśhrīveṁkaḍeśha yinniḍā jāṇam̐ḍavu nĕlagŏni pĕṁḍlāḍam̐ga ne nemanenu