Title (Indic)మాటకు మాఁటె యాడి మంచితనము సేయక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాటకు మాఁటె యాడి మంచితనము సేయక నీటున సరసమాడ నేఁడు నాకుఁ జెల్లునా (॥మాటకు॥) ఘనుఁడ వంటా నీకుఁ గానుక చేతి కిచ్చితే యెనసి నీ వాపెచేతి కియ్యఁ దగునా ననిచి నీనేరమా నానేర మింతే కాక నిను దొర వని నమ్మి నేస్తము సేసినది (॥మాటకు॥) కాంతుఁడ వనుచు నావుంగరము వేలఁ బెట్టితే అంతలో నాపె కిచ్చితి వది దగునా అంతయు నీకడమలా అది నాకడమ గాక వింత లేనిపొందు నీతో వేడుకఁ జేసినది (॥మాటకు॥) హితవరి వని నీతో నేకతము చెప్పితేను అతివతోఁ జెప్పితివి అవురా నీవు కతకారి శ్రీవెంకటనాథ నన్నుఁ గూడి బతిమివట్టు కుండఁగా బాసడుగఁ జెల్లునా. English(||pallavi||) māḍagu mām̐ṭĕ yāḍi maṁchidanamu seyaga nīḍuna sarasamāḍa nem̐ḍu nāgum̐ jĕllunā (||māḍagu||) ghanum̐ḍa vaṁṭā nīgum̐ gānuga sedi kichchide yĕnasi nī vābĕsedi kiyyam̐ dagunā nanisi nīneramā nānera miṁte kāga ninu dŏra vani nammi nestamu sesinadi (||māḍagu||) kāṁtum̐ḍa vanusu nāvuṁgaramu velam̐ bĕṭṭide aṁtalo nābĕ kichchidi vadi dagunā aṁtayu nīgaḍamalā adi nāgaḍama gāga viṁta lenibŏṁdu nīdo veḍugam̐ jesinadi (||māḍagu||) hidavari vani nīdo negadamu sĕppidenu adivadom̐ jĕppidivi avurā nīvu kadagāri śhrīvĕṁkaḍanātha nannum̐ gūḍi badimivaṭṭu kuṁḍam̐gā bāsaḍugam̐ jĕllunā.