Title (Indic)మాట లాడనేరని రమణిఁ బో నేను, నా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాట లాడనేరని రమణిఁ బో నేను, నా మాటలెల్లఁ బైఁడివంటి మాటలే గదె (॥మాట॥) పచ్చగందని పడుచఁ బడఁతి నేను, నేఁ డచ్చి వేసినట్టి వనితనె కదవె లచ్చిగొండి నీవంటినెలఁతనా నేను, యింత పెచ్చువెరిగే వదేమె పిన్నదానవా (॥మాట॥) మిగులదళము గలమేఁటిఁబో నేను, నీ దగునింటి ముంగిటి నిధానమంగదే జగడాలగంప దింపుసతినా నేను, యింత చిగురుఁగొమ్మ వదేమె చిన్నదానవా (॥మాట॥) తలపూ వాడని తరుణినే నేను, నే నలరుఁజవికలోనియాకెనే కదే కలికి వేంకటపతి కాంతనేనూ నేఁ దొలియింతి నాకంటె దొడ్డదానవా English(||pallavi||) māḍa lāḍanerani ramaṇim̐ bo nenu, nā māḍalĕllam̐ baim̐ḍivaṁṭi māḍale gadĕ (||māḍa||) pachchagaṁdani paḍusam̐ baḍam̐ti nenu, nem̐ ḍachchi vesinaṭṭi vanidanĕ kadavĕ lachchigŏṁḍi nīvaṁṭinĕlam̐tanā nenu, yiṁta pĕchchuvĕrige vademĕ pinnadānavā (||māḍa||) miguladaḽamu galamem̐ṭim̐bo nenu, nī daguniṁṭi muṁgiḍi nidhānamaṁgade jagaḍālagaṁpa diṁpusadinā nenu, yiṁta sigurum̐gŏmma vademĕ sinnadānavā (||māḍa||) talabū vāḍani taruṇine nenu, ne nalarum̐javigaloniyāgĕne kade kaligi veṁkaḍabadi kāṁtanenū nem̐ dŏliyiṁti nāgaṁṭĕ dŏḍḍadānavā