Title (Indic)మాపులే మరణములు రేపులే పుట్టువులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపులే మరణములు రేపులే పుట్టువులు చాపలాలు మాని విష్ణు శరణను మనసా (॥మాపు॥) చాలునంటే యించుకంతే చాలును జన్మమునకు చాలకున్న లోకమెల్లఁ జాలదు వీలిన యీయాసా వెర్రివాని చేతిరాయి చాలు నింక హరి నిట్టె శరణను జీవుఁడా (॥మాపు॥) పాఱకున్న పశుబాలై బడలదు మనసు పాఱితే జవ్వనమునఁ బట్టరాదు మీఱిన నీరుకొద్ది దామెర యింతె యెంచి చూడ జాఱవిడిచి దేవుని శరణను జీవుఁడా (॥మాపు॥) సేయకున్నఁ గర్మము శ్రీపతిసేవనే వుండు సేయఁబోతేఁ గాలమెల్లా సేనాసేన వోయయ్య యిది యెల్లా వుమినాఁకే చవుతాలు చాయల శ్రీవేంకటేశు శరణను జీవుఁడా English(||pallavi||) mābule maraṇamulu rebule puṭṭuvulu sābalālu māni viṣhṇu śharaṇanu manasā (||mābu||) sālunaṁṭe yiṁchugaṁte sālunu janmamunagu sālagunna logamĕllam̐ jāladu vīlina yīyāsā vĕrrivāni sedirāyi sālu niṁka hari niṭṭĕ śharaṇanu jīvum̐ḍā (||mābu||) pāṟagunna paśhubālai baḍaladu manasu pāṟide javvanamunam̐ baṭṭarādu mīṟina nīrugŏddi dāmĕra yiṁtĕ yĕṁchi sūḍa jāṟaviḍisi devuni śharaṇanu jīvum̐ḍā (||mābu||) seyagunnam̐ garmamu śhrībadisevane vuṁḍu seyam̐bodem̐ gālamĕllā senāsena voyayya yidi yĕllā vuminām̐ke savudālu sāyala śhrīveṁkaḍeśhu śharaṇanu jīvum̐ḍā