Title (Indic)మాపుదాఁకా వట్టిమాటలేమిటికి నిఁక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపుదాఁకా వట్టిమాటలేమిటికి నిఁక తీపులకుఁ గుఱి మోవి దిష్టంబులే (॥మాపు॥) తలపోఁతలకును గుఱి తమకంబులే చెలియ వలపులకు గుఱి నిండు వయసు మదమే చలములకు గుఱి తగిన సమరతుల నిబ్బరము పిలుపులకు గుఱి మంచి ప్రియములివియే (॥మాపు॥) యెనయు నాసలకు గుఱి యెడతాఁకులే చెలియ ననుపులకు గుఱి సెలవినవ్వులివియే చనవులకు గుఱి మిగుల సలిగెలు మెరయుటలు మొనయ పొందులకు గుఱి మొగమోటలే (॥మాపు॥) జిగిఁ గలయికలకు గుఱి సిగ్గు విడుచుటె చెలియ తగులమికి గుఱి యేకతములవునికే తగిన శ్రీ వేంకటోత్తముఁడు ననునిటు గూడె పొగరుమన్ననకు గుఱి భోగంబులే English(||pallavi||) mābudām̐kā vaṭṭimāḍalemiḍigi nim̐ka tībulagum̐ guṟi movi diṣhṭaṁbule (||mābu||) talabom̐talagunu guṟi tamagaṁbule sĕliya valabulagu guṟi niṁḍu vayasu madame salamulagu guṟi tagina samaradula nibbaramu pilubulagu guṟi maṁchi priyamuliviye (||mābu||) yĕnayu nāsalagu guṟi yĕḍadām̐kule sĕliya nanubulagu guṟi sĕlavinavvuliviye sanavulagu guṟi migula saligĕlu mĕrayuḍalu mŏnaya pŏṁdulagu guṟi mŏgamoḍale (||mābu||) jigim̐ galayigalagu guṟi siggu viḍusuḍĕ sĕliya tagulamigi guṟi yegadamulavunige tagina śhrī veṁkaḍottamum̐ḍu nanuniḍu gūḍĕ pŏgarumannanagu guṟi bhogaṁbule